మల్లారెడ్డి స్కెచ్ మామూలుగా లేదుగా.. ఒకే దెబ్బకు మోదీ, రేవంత్ తో ఫ్రెండ్షిప్! తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ సర్కార్ కు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. By Nikhil 07 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి కూల్చివేతలు, కేసుల భయంతో మాజీ మంత్రి మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారా? కాంగ్రెస్ లో చేరేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రూటు మార్చారా? బీజేపీలో చేరకుండానే కేంద్రం నుంచి, కాంగ్రెస్ లో చేరకుండానే రేవంత్ సర్కార్ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేలా వ్యూహాలు రాచిస్తున్నారా? ఈ రోజు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే అనిపిస్తోంది. ఈ రోజు అకస్మాత్తుగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రత్యక్ష్యమయ్యారు మల్లారెడ్డి. అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డిని వెంట బెట్టుకుని మల్లారెడ్డి చంద్రబాబును కలిశారు. తన మనవరాలు వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సమావేశం అనంతరం బయటకు వచ్చిన తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ఆ పార్టీలో చేరుతారని ప్రకటించారు. శాసనసభ్యులు @MarriRajasekar మమత గార్ల కూతురు మా మనువరాలు శ్రేయ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి అందజేసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది. pic.twitter.com/kSkgX0WdPz — Chamakura Malla Reddy (@chmallareddyMLA) October 7, 2024 ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్నారు మల్లారెడ్డి. అయితే.. మల్లారెడ్డి కూడా టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం ఈ రోజు ఉదయం నుంచి జోరుగా సాగుతోంది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. కాలేజీల్లో అక్రమ నిర్మాణాలు, భూ కుంభకోణాలు.. ఇలా రోజుకో వివాదం ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో కొన్ని భవనాలను సైతం కూల్చివేసింది రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నించినా.. అపాయిట్మెంట్ దొరకలేదు. దీంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా మల్లారెడ్డి సిద్ధమయ్యారన్న వార్తలు వినిపించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో భేటి అయిన మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి.2 గంటల నుంచి కొనసాగుతున్న సమావేశం.. pic.twitter.com/uqpFXp1coZ — Telugu Scribe (@TeluguScribe) March 7, 2024 ఎవరొచ్చినా భయపడేది లేదు - మల్లారెడ్డిమల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారు. కాంగ్రెస్, బీజేపీకి క్యాడర్ లేనే లేదంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.pic.twitter.com/vbWF3JLQOn — Ravi Pulusu NRI BRS UK (@RPR_TRS) March 22, 2024 అప్పట్లో హస్తం గూటికి చేరుతారని టాక్.. మల్లారెడ్డే మనసు మార్చుకున్నారో? లేక కాంగ్రెస్ పెద్దలే వద్దన్నారో? తెలియదు కానీ.. ఆయన హస్తం గూటికి మాత్రం చేరలేదు. దీంతో మళ్లీ అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హడావుడి చేస్తూ వస్తున్నారు మల్లారెడ్డి. అయితే.. ఈ రోజు అనూహ్యంగా ఆయన చంద్రబాబును కలవడంతో కొత్త చర్చ మొదలైంది. మల్లారెడ్డి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో చేరడం ద్వారా కేంద్రం నుంచి సపోర్ట్ పొందొచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సన్నిహిత్యం కూడా తనకు అనుకూలంగా మారుతుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన బిల్డింగ్ లపైకి బుల్డోజర్లను పంపించినా.. ఆస్తులపైకి అధికారులను పంపించినా చంద్రబాబుతో చెప్పించి ఆపించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఒకే సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పొందడానికి మల్లారెడ్డి స్కెచ్ వేశారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ఈ టాక్ నిజం అవుతుందా? టీడీపీలో చేరినంత మాత్రానా రేవంత్ సర్కార్ ఆయనను వదిలిపెడుతుందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. #cm-revanth-reddy #chandrababu #mallareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి