నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. By V.J Reddy 09 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి CM Chandrababu: రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు నేడు తిరిగి ఏపీకి రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోధీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి విషయమే ప్రధాన ఎజెండా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగింది. కాగా ఈరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9.25కి ఢిల్లీ నుంచి చంద్రబాబు బయల్దేరనున్నారు. ఉదయం 11.40కి గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నివాసానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు వెళ్లనున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా.. ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంతో పాటు NSG అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఉంది. ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎం ల రాక కారణంగా సామాన్య భక్తుడి దర్శనం నిలుపుదల ఉండదని దేవాదాయ శాఖామంత్రి తెలిపారు. సాయంత్రం 4 గంటల తరువాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. Also Read : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు #pawan-kalyan #delhi #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి