తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.

New Update

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ''లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల క్వాలిటీ బాగుండేలా చూడాలి. అత్యుత్తమ పదార్థాలనే వాడాలి. ఏ విషయంలో కూడా రాజీపడొద్దు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి ఉండకూడదు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి.

Also Read: భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు

ఆర్భాటం, అనవసర ఖర్చులు వద్దు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా కూడా భంగం కలిగించకూడదు. దురుసు ప్రవర్తన ఎక్కడా కనిపించకూడదు. తిరుమలలో ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలని'' సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు