భారత్ సెమీస్‌కు చేరాలంటే.. ఆసీస్‌పై తప్పకుండా గెలవాల్సిందేనా?
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ రోజు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిందే. భారీ రన్‌రేట్‌తో భారత్ గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశాలు ఉంటాయి.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ రోజు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిందే. భారీ రన్‌రేట్‌తో భారత్ గెలిస్తేనే సెమీస్‌కు చేరే అవకాశాలు ఉంటాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు ప్రతి ఏడాది 1000 వర్క్, హాలీడే వీసాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలలు వరకు అక్కడ ఉండేందుకు ఈ వీసా జారీ చేస్తారు.
పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. తన ప్రమేయం లేకుండా చాలా విషయాల్లో జోక్యం చేసుకుందన్నాడు.
మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు.
ఆస్ట్రేలియాలో రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు.భారత్ కు చెందిన ఆనంద్ ఫ్యామిలీతో స్టేషన్‌లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా స్ట్రోలర్ ట్రాక్ పై పడింది.పిల్లల్నిరక్షించే క్రమంలో ఆనంద్ పట్టాలపైకి దూకగా ఈ ప్రమాదం జరిగింది.
60 కి పైగా కుక్కలను తీవ్రంగా హింసించి..అత్యాచారం చేసి వాటిని అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో జువాలసిస్ట్ ఆడమ్ బ్రిటన్ కి ఆస్ట్రేలియాలో అతనికి 249 ఏళ్ల జైలు శిక్ష పడింది.జంతు హింసకు సంబంధించి తనపై వచ్చిన 60కి పైగా నేరారోపణలను ఆడమ్ స్వయంగా అంగీకరించాడు.
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ యువతి మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వచ్చేందుకు మెల్బోర్న్లోని క్వాంటస్ విమానాన్ని ఏక్కేందుకు తుల్లామరైన్ అనే ఎయిర్‌పోర్టుకు వచ్చింది. విమానం ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుంటుండగా.. అస్వస్థకు గురై ప్రాణాలు విడిచింది.
పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్‌కప్‌లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
టీ20 చరిత్రలో పాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. వరుస మ్యాచ్ లలో హ్యాట్రిక్ సాధించాడు. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై హ్యాట్రిక్ చేసిన కమిన్స్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై కూడా హ్యాట్రిక్ సాధించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండు హ్యాట్రిక్స్ సాధించి రికార్డ్ సృష్టించాడు.