సినీ నటితో డేటింగ్.. ఆస్ట్రేలియా టూర్‌లో నరకం చూశా పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. తన ప్రమేయం లేకుండా చాలా విషయాల్లో జోక్యం చేసుకుందన్నాడు. By srinivas 26 Sep 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Yuvaraj Singh : సినీ నటితో డేటింగ్ అనుభవంపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. పెళ్లికిముందు ఎప్పుడూ ఈ విషయంపై స్పందించని యువీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటితో ప్రేమయానం నడిపింది నిజమేనని చెప్పాడు. అయితే ఇది తనకు ఇష్టంగా జరగలేదని, ఆమె బలవంతపెడితే అసంతృప్తిగానే డేటింగ్ చేసినట్లు తెలిపాడు. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) మంకీ గేట్ వివాదంలో డేటింగ్ గోల.. ఈ మేరకు యువీ మాట్లాడుతూ.. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాం. అప్పుడు మంకీ గేట్ వివాదం నడుస్తోంది. ఇరు జట్ల మధ్య వాతావరణం వేడిగా ఉంది. ఆ సమయంలోనే డేటింగ్ మొదలైంది. ఆమె అడిలైడ్‌లో షూటింగ్ కోసం వచ్చింది. మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. చెప్పుకుండా నా దగ్గరకు రావడంతో 'ప్లీజ్' నువ్వు నన్ను డిస్ట్రబ్ చేయొద్దు. నేను ఆటపై ఫోకస్ చేయాలి’ అని చెప్పాననని గుర్తు చేసుకున్నాడు. తప్పని పరిస్థితిలో ఒక రోజంతా.. అయితే ఆమె మాత్రం తన వెనకాలే కాన్‌బెర్రాకు వచ్చేసిందని చెప్పాడు. 'మొదటి రెండు టెస్టుల్లో పెద్దగా రన్స్ చేయలేదు. ఆమెను చూశాక ‘నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?’ అని ప్రశ్నించాను. ‘నీతో సరదాగా గడుపేందుకు వచ్చాను’అని చెప్పింది. ఇక ఆ రోజంతా ఆమెతో తప్పని పరిస్థితిలో ఉండిపోయానని చెప్పాడు. తర్వాత తన సూట్‌కేస్‌ను ఆమెనే ప్యాక్ చేసిందని, షూ ప్యాక్ చేసి తన చెప్పులు వేసుకోమని ఇబ్బంది పెట్టినట్లు తెలిపాడు. చివరికీ ఈ తతంగా మొత్తం గమనించిన టీమ్ సభ్యులు చప్పట్లు కొట్టి మరీ ఆటపట్టించారని గుర్తుచేసుకున్నాడు. ఆమె పేరును మాత్రం వెల్లడించలేదు యువరాజ్ సింగ్. Also Read : ముడా స్కామ్ వివాదం.. సీబీఐకి షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య #dating #australia #yuvraj-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి