భారతీయులకు ఆస్ట్రేలియా బంపర్‌ ఆఫర్‌.. ఏంటో తెలుసా ?

ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు ప్రతి ఏడాది 1000 వర్క్, హాలీడే వీసాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలలు వరకు అక్కడ ఉండేందుకు ఈ వీసా జారీ చేస్తారు.

New Update
VISA

ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు ప్రతి ఏడాది 1000 వర్క్, హాలీడే వీసాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక, వాణిజ్య సహకారంలో భాగంగా ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం  ప్రకారం ఈ వీసాలను జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య కుదుర్చుకున్న ఈసీటీఏ ఒప్పందం డిసెంబర్‌ 20222 నుంచి అమల్లోకి వచ్చింది.  ఇరుదేశాల మధ్య రాకపోకలు, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని మంత్రి పీయూష్ గోయల్‌ అన్నారు. సెప్టెంబర్ 23 నంచి 26 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించారు. 

Also Read: మూడు సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని..

అయితే ఈసీటీఏ ఒప్పందం ప్రకారం.. ఆస్ట్రేలియాలో ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలలు వరకు అక్కడ ఉండేందుకు ఈ వీసా జారీ చేస్తారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల భారతీయ యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక రూల్క్‌కు కట్టుబడి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు ఏటా వెయ్యి వీసాలు జారీ చేస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు