ఆసీస్ తొలి టెస్టుకు టీమిండియా తుది జ‌ట్టు ఇదే.. ఆ ప్లేయర్ కు నో ఛాన్స్

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ  జరగనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టుకు రోహిత్ శ‌ర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతోంది. పెర్త్ టెస్టు కోసం భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
ind

ఇండియా - ఆస్ట్రేలియా మధ్య బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ  జరగనున్న విషయం తెలిసిందే. ఈ ట్రోఫీ స్టార్ట్ అవ్వడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. న‌వంబ‌ర్ 22న పెర్త్ వేదిక‌గా తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై భారత్ అడుగుపెట్టింది. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతోంది. 

ఈ క్ర‌మంలో పెర్త్ టెస్టు కోసం భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భార‌త ఓపెన‌ర్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ను ర‌విశాస్త్రి ఎంపిక చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్ కు రావాల‌ని సూచిస్తూ ధ్రువ్‌ జురెల్‌కు సైతం ఫస్ట్ టెస్ట్ లో చోటు కల్పించాడు.

Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ

" తొలి టెస్టులో భార‌త ఓపెన‌ర్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ను ప్ర‌మోట్ చేయాలి. అత‌డికి ఓపెనర్‌గా అనుభ‌వం ఉంది. గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో అత‌డు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒక‌వేళ గిల్ జ‌ట్టులో లేక‌పోయింటే  ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాక‌ప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. 

ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వ‌ర‌న్ కనీసం హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను దాట‌లేక‌పోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జ‌ట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి. తుది జ‌ట్టులో అశ్విన్ లేదా జ‌డేజాకు చోటు ఇవ్వాలా అన్న చ‌ర్చ న‌డుస్తోంది. నేను అయితే జ‌డేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అత‌డు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయ‌గ‌ల‌డు. అశ్విన్‌కు ఓవర్సీస్‌లో పెద్ద‌గా రికార్డు లేదు.." అని రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు.

Also Read: Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ

 ఆసీస్ తో తొలి టెస్ట్ కోసం రవిశాస్త్రి ఎంచుకున్న భార‌త తుది జ‌ట్టు ఇదే..

శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు