Bumrah: 150కు ఇండియా ఆలౌట్..67/7తో ఆస్ట్రేలియా..ముగిసిన మొదటిరోజు ఆట

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మొదటి టెస్ట్  మొది రోజు ఆట ముగిసింది. బ్యాటాంగ్‌లో ఎప్పటిలానే నిరాశపర్చిన టీమ్ ఇండియా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. రోజు ముగిసేసరికి  7 వికెట్ల నష్టానికి ఆసీస్ 67 పరుగులు చేసింది. 

New Update
cric

India Vs Australia First Test

ఆస్ట్రేలియా–ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ పెర్త్‌లో జరుగుతోంది. దీనిలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 150 పరుగులకే ఆలౌటై పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డి ఒక్కడే 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పంత్ (37), కేఎల్ రాహుల్ (26), ధ్రువ్ జురెల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. విరాట్ కోహ్లీ (5), సుందర్ (4), హర్షిత్ రాణా (7), బుమ్రా (8) లు ఘోరంగా అవుట్ అయి వెనుదిరిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆసీస్‌ బౌలర్లు జోష్ హేజిల్ వుడ్ (4/29), కమిన్స్ (2/14), మార్ష్ (2/12), స్టార్క్ (2/14) వికెట్లు తీసుకున్నారు. 

Also Read: రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

ఇక తరువాత బౌలింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియా అద్భుతంగా రాణించింది. బ్యాటర్ల వైఫల్యాన్ని బౌలింగ్‌తో తుడిచేసింది. ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభం నుంచే వరుస షాక్‌లు ఇచ్చారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అలెక్స్‌ కెరీ (19), మిచెల్ స్టార్క్‌ (6) క్రీజులో ఉన్నారు. నాథన్ మెక్‌స్వినీ (10), ఉస్మాన్‌ ఖవాజా (8), స్టీవ్‌ స్మిత్‌ (0)లను బుమ్రా ఔట్ చేసి ఆసీస్‌ బ్యాటింగ్ లైనప్‌ను  గట్టిదెబ్బ తీశాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో బుమ్రా (4/17), సిరాజ్ (2/17), హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 83 పరుగులు చేయాల్సి ఉంది. మొత్తానికి బుమ్రా చెలరేగిపోయాడనే చెప్పాలి. వరుస బంతుల్లో ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేయడం లిసి వచ్చింది. ఆ ప్రెజర్ ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌‌ మీద బాగా ప్రభావం చూపించింది. దీంతో తరువాత వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కు సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. ఇక రేపు మ్యాచ్ మొదలయ్యాక ఇంతే వేగంగా వికెట్లు పడిపోతే..భారత టీమ్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతానికి బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పెర్త్ పిచ్ రేపటికి ఎలా టర్న్ అవుతుందో చూడాలి. దాంతో పాటూ మన బ్యాటర్లు రేపు సిగ్గా ఆడాలి. మొదటి రోజులానే తొందరగా వికెట్లు పోగొట్టేసుకుంటే ఓటమికి తలవంచక తప్పదు. 

Also Read: Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్!

Also Read: ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం

Advertisment
Advertisment
తాజా కథనాలు