ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. 15వ తేదీకి వాయిదా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఎందుకోసమంటే.. ఇసుక స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏపీలో దారుణం.. దళిత యువకుడిపై దాడి చేసి మూత్రం పోసిన దుండగులు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడ్ని కిడ్నాప్ చేసి.. అతనిపై దాడి చేసి మూత్రం పోయడం కలకలం రేపుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం చర్చనీయాంశమవుతోంది. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అప్పుడేం చేశారు.. నారా లోకేష్ పై మంత్రి విడదల రజని సంచలన కామెంట్స్.. నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విడదల రజని. ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తుంటే.. లోకేష్ మాత్రం హేళన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని.. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని అన్నారు. By Shiva.K 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్.. వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్‌లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: 'కళ్లు తెరిపిద్దాం'.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 'జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు సంఘీభావంగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదిద్దాం.' అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: దూకుడు పెంచుతున్న పురందేశ్వరి.. కారణమేంటి? ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె టీడీపీ మైలేజ్ పెంచడం కోసమే ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు.. సొంత పార్టీ కోసమా లేక టీడీపీ కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest Updates: ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి.. చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn