ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో మరో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు.. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోదావరిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. వీళ్లలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు, ఓ మహిళా ఉన్నారు. సావిత్రి, అనుపోజు రఘువర్మ, అనుపోజు వసంత్‌లు మృతిచెందినట్లుగా గుర్తించారు. మరో ఇద్దరు యువతుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీళ్లిద్దరినీ మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు.. ఆ బూతులు వింటే చెవుల నుంచి రక్తాలు రావాల్సిందే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం నుండి తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తున్న యువకులను పుంగనూరు నియోజకవర్గం పరిధిలో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డగించారు. టీడీపీ కార్యకర్తలను బండ బూతులు తిట్టారు. సైకిల్‌కి ఉన్న జెండాలను దగ్గరుండి మరీ తీసేయించారు. జెండాలు, బ్యాగులు సర్దుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏఏజీ, సీఐడీ చీఫ్‌పై విచారణకు ఆదేశం.. ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhaptnam: గాలి వీస్తే చాలు హడలిపోతున్న విశాఖ వాసులు.. ఈ భయానికి ఆ చెట్టే కారణమట..! విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పచ్చదనం కోసం ఉడా అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయ్. గాలి పీల్చాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ్. మరి ఆ చెట్లు ఏంటో తెలియాలంటే.. పైన హెడ్డింగ్ క్లిక్ చేయాల్సిందే. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SI Jobs Updates: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో మెయిల్‌కు పంపాలని తెలిపింది. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన జైలు అధికారులు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. నారా చంద్రబాబు నాయుడికి రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజనీ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం నేతృత్వంలో వైద్య పరీక్షలు చేయించారు. By Shiva.K 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది.. నారా భువనేశ్వరి.. నారా లోకేష్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి అన్నారు. యవగళంలో లోకేష్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె అన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. By Shiva.K 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబుకు అరెస్ట్‌కు నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమం.. పాల్గొన్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు లైట్లు ఆపేసి, కొవ్వత్తులు వెలిగించి వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి సహా టీడీపీ ముఖ్య నేతలంతా కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోకేష్ ఈ కార్యక్రమం నిర్వహించారు. By Shiva.K 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Elections: ఏపీలో ఎన్నికల మూడ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn