/rtv/media/media_files/2025/11/28/scrub-typhus-fever-2025-11-28-09-34-33.jpg)
Scrub Typhus fever
ఆంధ్రప్రదేశ్(andhra-pradesh-news) ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు. అయితే, ఈ మరణాలు స్క్రబ్ టైఫస్(scrub typhus treatment) వల్లే సంభవించాయో లేదో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉందని, దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ కేసులే నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు.
Also Read : రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి అద్భతం.. బీజేపీ నేత యామిని శర్మ సంచలన పోస్టు..
ఇతర రాష్ట్రాల్లో కేసులు
కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణలో 309 కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం కొమెరపూడి గ్రామానికి చెందిన బత్తుల లూర్దమ్మ (64) జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు(scrub typhus symptoms) కనిపించడంతో ఇక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాగా, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ఒకరిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
Also Read : మంత్రి లోకేష్ అమెరికా-కెనడా టూర్.. పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు!
Follow Us