stock markets: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

మధ్యలో వీకెండ్ బ్రేక్ వచ్చింది. శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ సోమవారం ఓపెన్ అయ్యాయి. కానీ గత వారం నష్టాలనే మార్కెట్ ఈరోజు కూడా మోస్తోంది. స్వల్ప నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం అయ్యాయి.

New Update
Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావం దేశీయ మార్కెట్ల పడుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప నష్టాతో ప్రారంభం అయ్యాయి. అమెరికా గృహ అమ్మకాల డేటా విడుదల, క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్ల మీద అధిగుబడులతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర పెంటిమెంట్ కూడా మర్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. గత వారం ఆల్మోస్ట్ ఐదు రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ లోనే నడిచాయి. ఈరోజు ఉదయం 9.26 గంటలకు సెన్సెక్స్ 39 పాయింట్ల నష్టంతో 65,969 దగ్గర ట్రేడ్ అయింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 19, 658 దగ్గర కొనసాగుతోంది. సెన్స్క్స్ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా, ఎస్ బీఐ, ఎన్టీపీసీ షేర్లు లాబాల్లో ఉండగా...యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్ టెల్, నెస్ట్లే ఇండియా, టాటా స్టీల్ షేర్లు నష్టలతో కొనసాగుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 83.04 దగ్గర ప్రారంభమైంది.
ఇక ఈరోజు గమనించాల్సిన స్టాక్స్ లో ఆదానీ గ్రీన్ ఎనర్జీ, డెల్టా కార్ప్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఎల్ఐసీ లు ఉన్నాయి.

గత వారాన్ని అమెరికా మార్కెట్లు నష్టాలతో ఉగించాయి.. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో నడియా.ఇ దాని ప్రభావం నేటి ఆసియా మార్కెట్ల మీద ఉంది. అందుకే మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు బంగారం రేటు స్థిరంగా కొనసాగుతోంది. గత రెండు రోజులుగా బంగారం ధర పెద్దగా పెరగలేదు. దీంతో గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లబించినట్టయింది. బులియన్ మార్కెట్ లో బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములు 54, 900 ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 59, 950గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా నిన్నటిలాగే కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర ఈరోజు 75,800లుగా ఉంది. అయితే హైదరాబాద్, వైజాగ్ లలో మాత్రం ఈ ధర కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 79, 300గా కొనసాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు