Stock Market Today: ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది. By Manogna alamuru 26 Sep 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Stock Market Today: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల ప్రభావాలతో దేశీయ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా మొదలయ్యాయి. సెన్సెక్స్ (Sensex)30 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 19 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్న రోజు ముగిసేసరికి మరీ ఎక్కువగా కాకపోయినా లాభాలతో దేశీయ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, జెఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్, రిలయన్స్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, నెస్ట్లే ఇండియా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లోకొనసాగుతున్నాయి. మరో వైపు బంగారం ధరలు ఈరోజు మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1914 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 23 డాలర్ల వద్ద ఉంది. అదే సమయంలో డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది.దేశీయంగా గోల్డ్ రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 54,950గా ఉంది. వరుసగా మూడు రోజులుగా బంగారం ఇదే రేటును కొనసాగిస్తోంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 59,950 గా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి రేటు రూ. 300 దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి రూ. 79 వేల ఉంది. అంతకుముందు రెండు రోజుల వ్యవధిలో రూ.1300 పెరిగింది. ఇవి కూడా చదవండి: జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా.. ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? జగన్ సంచలన నిర్ణయం? #gold #market #india #stock-market #stocks #stock-market-news #rates #stock-market-today #shares #sensex #nifty #dollar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి