/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)
Virat Kohli
టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పాకిస్థాన్ (Pakistan) తో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే కొంతకాలంగా తన ఫామ్‌పై అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు అన్న సంగతి తెలిసిందే.
Also Read: Anand Mahindra: ఒబెసిటీ పై పోరు..ఆనంద్ మహీంద్రా నామినేట్ చేసింది వీరినే!
నిజానికి ఈ షాట్ కోసం ప్రయత్నిస్తూనే విరాట్ కొంతకాలంగా పదే పదే స్లిప్‌లో క్యాచ్ ఇస్తూ ఔట్ అయ్యాడు. అయితే దీన్ని విరాట్ అంగీకరించాడు. నిజంగానే కవర్‌డ్రైవ్ తనకు బలహీనంగా మారిందని ఒప్పుకున్నాడు.'ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారింది. కానీ ఆ షాట్‌తో నేను చాలా పరుగులే చేశాను.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశి వారికి అన్ని శుభవార్తలే ..కానీ ..!
తొలి రెండు బౌండరీలు...
ఈ రోజు నేను నా షాట్లను నమ్ముకున్నా. నా తొలి రెండు బౌండరీలు కూడా కవర్ డ్రైవ్ ద్వారానే వచ్చాయి. అలాంటి షాట్ల వల్ల బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్‌తోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు అది మంచి ఇన్నింగ్స్. జట్టుకు ఇది మంచి విజయం' అని బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియోలో విరాట్ చెప్పుకొచ్చాడు.
రీసెంట్గా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఆ బలహీనతను దాటేసినట్లు కనపడ్డాడు. అతడు చూడ ముచ్చటైన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌పై ఉన్న అనుమానాలకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లోనే విరాట్ వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత ఈ మైలురాయి అందుకున్న మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం గురించి విరాట్ ప్రస్తావించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగేటప్పుడు జట్టను గెలిపించే స్థితిలో ఉంచడాన్నే ఆలోచిస్తానని అన్నాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటా. ముప్పు తప్పించడం, జట్టును గెలిచే స్థితిలో నిలపడంపై దృష్టిపెడతా. కుదిరితే ఛేదన పూర్తి చేస్తా. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా, కొన్నేళ్లలో నా పాత్రలో ఎలాంటి మార్పు లేదు' అని విరాట్ వెల్లడించాడు.
Also Read: Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్!