/rtv/media/media_files/2025/02/11/5CCXnWmpZCoOR0c3A9Q6.jpg)
Virat Kohli hugging a woman
Virat Kohli: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున స్టేడియాలకు తరలివస్తున్నారు. ఇందులో భాగంగానే కటక్‌లో జరిగిన రెండో వన్డే కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న కోహ్లీని చూడటానికి జనాలు మైదానానికి పోటెత్తారు. కోహ్లీతో సెల్ఫీ, ఆటోగ్రాఫ్, షేక్ హ్యాండ్ కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే మూడో వన్డే కోసం భారత జట్టు అహ్మదాబాద్ బయలుదేరడానికి భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. దీంతో ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ వచ్చిన సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకోగా వీడియో వైరల్ అవుతోంది.
Virat Kohli met a lady (close relative) at Bhubaneswar airport🥹❤️ pic.twitter.com/r71Du0Uccf
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) February 10, 2025
నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి..
ఈ మేరకు ఎయిర్ పోర్టులో చెకింగ్ కు ముందు క్రికెటర్లను చూడటానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సమయంలోనే కోహ్లీ అటువైపు రాగానే ఓ మహిళ అభిమాని ముందుకు పరిగెత్తుకొచ్చింది. దీంతో ఏమాత్రం ఆవేశానికి లోను కాకుండా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చి పలకరించాడు విరాట్. మిగిలినవారు కూడా కోహ్లీతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కోహ్లీని అక్కడినుంచి పంపించారు. ఈ హగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ లక్కీ లేడీ ఎవరంటూ జనాలు సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే ఆమె కోహ్లీ రిలేషన్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు 3 వన్డేలో ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. బుధవారం అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో 3వ వన్డే జరగనుంది.