/rtv/media/media_files/2025/04/07/FAg3RUfptg1iOShYl0XL.jpg)
Harshal Patel
సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 8 వికెట్ల నష్టానికి152 స్కోర్ చేయగా, గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ (5), గిల్ (61*), బట్లర్ (0), సుందర్ (49), రూథర్‌ఫర్డ్ (35*) పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. మొత్తానికి అన్ని విభాగాల్లోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
Also Read : కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!
Also Read : అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
హర్షల్ పటేల్ కు అనారోగ్యం
ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు. దీంతో అతడి స్థానంలో కెప్టెన్ కమిన్స్ ఉనద్కత్ ను జట్టులోకి తీసుకున్నాడు. అయితే నిన్నటి స్లో పిచ్ పై హర్షల్ పటేల్ కీ రోల్ అయ్యేవాడని.. అతడు జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. పటేల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30.50 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మెగా వేలంలో సన్‌రైజర్స్ ఉనద్కత్‌ను రూ. 1 కోటికి కొనుగోలు చేసింది మరియు ఎడమచేతి వాటం సీమర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు. అయితే హర్షల్ పటేల్ తరువాతి మ్యాచ్ కు అయిన అందుబాటులో ఉంటాడా లేదా అన్నది చూడాలి.
This match is being played on a black soil pitch, expected to be slower so Harshal Patel is a miss for SRH. He becomes better on slower wickets. Jaydev Unadkat, another bowler who loves using his slower balls replaces him.
— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) April 6, 2025
Also read : రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!
Also Read : SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ .. మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు
IPL 2025 | srh-vs-gt | sunrisers-hyderabad | gujarat-titans | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news | telugu-cricket-news