Shreyas Iyer: నేను దేనికోసం ఎవరిని బతిమాలను.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్!

జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడంపై శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా' అన్నాడు.

New Update
shreyas

Shreyas Iyer

Shreyas Iyer: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్ ట్రోఫీలో రీ ఎంట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించి ఛాంపియన్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించుకున్న శ్రేయస్.. అన్ని మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. అయితే మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుండగా ఈ సీజన్ లో పంజాబ్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న శ్రేయాస్.. జాతీయ జట్టుకు దూరమైనపుడు చాలా విమర్శలకు గురైనట్లు చెప్పుకొచ్చాడు. 

ఎలాంటి బాధ లేదు..

‘ఛాంపియన్ ట్రోఫీలో సెంచరీ మిస్ అయినందుకు ఎలాంటి బాధ లేదు. ట్రోఫీ గెలిచినందుకు చాలా సంతృప్తిగా ఉంది. అన్ని మ్యాచ్ ల్లో జట్టుకు మంచి స్కోరు సాధించడం ఆనందంగా ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో చాలా కఠిన శ్రమ చేశాను. అద్భుతమైన బంతులను కూడా సిక్సర్లుగా మలిచా. అది నాలో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. అయితే నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. అలా చేస్తే సెలెక్టర్లకు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా.  ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులతోపాటు నా సక్సెస్ లో చాలామంది ఉన్నారు' అని చెప్పాడు. 

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

ఇదిలా ఉంటే.. 2024 సీజన్ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్ ను కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు రూ.27 కోట్ల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్ ఉన్నా అక్షర్ పేరును అనౌన్స్ చేసింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు.  7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

Advertisment
Advertisment
Advertisment