Shikhar Dhawan: బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ!

ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలన్నాడు. 

New Update
bcci

Shikhar Dhawan

Shikhar Dhawan: ఆటగాళ్లను ప్రోత్సహించేదుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే పనిభారం పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించాడు. 

తప్పనిసరి చేయడం బాగుంది..

ఈ మేరకు ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధావన్.. బీసీసీఐ నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటున్నాయన్నారు. 'దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడం బాగుంది. ఇది భారత క్రికెట్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలి. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడుతుండటం సంతోషం. ఢిల్లీ తరఫున విరాట్‌ కోహ్లి ఆడినప్పుడు స్టేడియం నిండిపోయింది' అని గుర్తు చేశాడు. 

ఇది కూడా చదవండి: SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!

ఇదిలా ఉంటే.. బెస్ట్ ఫీల్డర్ విన్నర్‌ను ప్రకటించడానికి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి శిఖర్ ధావన్‌ ను దిలీప్‌ ఆహ్వానించారు. ఆటగాళ్లంగా చప్పట్లు కొడుతూ ధావన్‌ను స్వాగతం పలికారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్ అయ్యర్‌లను ధావన్ ప్రశంసించాడు. చివరకు అక్షర్ పటేల్‌ ను బెస్ట్ ఫీల్డర్‌గా ప్రకటించి మెడల్‌ అందించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి రోజున రాశీ ప్రకారం ఈ దానాలు చేస్తే.. సమస్యలన్నీ పరిష్కారం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment