/rtv/media/media_files/2025/03/22/ngQWpI0IbvJuodd7eSLX.jpg)
RCB VS KKR
ఈసాలా కప్ యమ్ దే అనడంతో సరిపోతోంది ఆర్సీబీకి. ప్రతీ ఏడాది ఇదే డైలాగ్ కొడుతుంది. కప్ మాత్రం కలగానే మిగిలిపోతోంది ఆర్పీబీకి. జట్టులో సూపర్ ప్లేయర్లు ఉన్నా మ్యాచ్ లు మాత్ర గెలవలేకపోతున్నారు. మరోవైపు లాస్ట్ ఇయర్ కప్ గెలుచుకుని ఉత్సాహం మీదుంది కేకేఆర్. ఇంతకుముందు ఏ టీమ్ గెలుస్తుంది...ఏ టీమ్ ఫేవరెట్ అని చెప్పడం ఈజీగా ఉండేది. టీమ్‌ల్లో స్టార్ల బట్టీ..అంచనా వేయడం అయ్యేది. అయితే ఈసారి ఐపీఎల్ డిఫరెంట్. ఎదందుకంటే దాదాపు అన్ని జట్లూ షఫల్ అయిపోయాయి. ప్రతీ టీమ్ లోనూ భారీగా మార్పులు జరిగాయి. దాంతో ముది నుంచీ ఏ టీమ్ గెలుస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. కొన్ని మ్యాచ్ లు అయితే కానీ అంచనాకు రాలేము.
మెదటి మ్యాచ్ కేకేఆర్ vsఆర్సీబీ..
ఈరోజ నుంచీ ఐపీఎల్ 2025సీజన్ ప్రారంభం అవుతోంది. ఈరోజు కోలకత్తాలో కేకేఆర్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతున్నాయి. కేకేఆర్ కు సీనియర్ ప్లేయర్ అజ్యింకా రహానే కెప్టెన్ గా ఉంటే...ఆర్సీబీకు కొత్త సారధి రజత్ పటీదార్ వచ్చాడు. జట్టు పరంగా ఆరసీబీ ఎప్పుడూ బలంగానే ఉంది. కానీ కప్పే గెలవలేకపోతోంది. బ్యాటర్లు, బౌలర్లు పుష్కలంగా ఉన్న ఈ టీమ్ లో నిలకడ తక్కువగా ఉంది. దాన్ని అధిగమిస్తేనే కానీ కప్ గెలవడం కష్టం. అయితే ఆర్సీబీ లో మెయిన్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో పాటూ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మాంచి ఊపుమీదున్నాడు. రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జాకబ్ బెత్‌వెల్‌తో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే ఈ టీమ్ కు మైనస్ అయ్యేది ఏమైనా ఉంటే అది స్పిన్నర్లు లేకపోడం. దాన్ని మేనేజ్ చేయగలిగితే...ఈ సాలా కప్ నమ్ దే అనొచ్చు.
ఇక కొలకత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే..జట్టులో మార్పులు జరిగినా కూడా డేంజరెస్ గానే ఉంది. టీమ్ లో అందరూ హిట్టర్లే ఉన్నారు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టగలరు..అదే సమయంలో ఎడా పెడా కూడా బాదగలరు. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, డికాక్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్ భారీగా హిట్టింగ్ చేసే బ్యాటర్లు. కెప్టెన్ అజింక్య రహానె, గుర్బాజ్, మనీశ్ పాండే నిలకడగా ఆడుతూ దూకుడు పెంచే టైప్. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోపీలో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి కేకేఆర్ టీమ్ లో ఉన్నాడు. ఇతనితో పాటూ సునీల్ నరైన్, ఆన్రిచ్ నోకియా, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియా లతో బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. మరోవైపు స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, పేస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పడానికి రెడీగా ఉన్నారు.
ఐపీఎల్ లో ఇప్పటి వరకు కేకేఆర్, ఆర్సీబీ 20 సార్లు తలపడగా..14 మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ లెక్క ప్రకార చూస్తే మొదటి మ్యాచ్ ను ఆర్సీబీనే ఎగురేసుకుని పోయే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోలకత్తాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్ష పడే ఛాన్స్ లు అధికంగా ఉన్నాయని చెప్పింది. దీంతో అసలు మొదటి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.
today-latest-news-in-telugu | ipl-2025 | rcb | kkr | kolkata | match
Also Read: USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్