/rtv/media/media_files/2025/03/10/VYIhFhy6xyNv9ZCOtoVn.jpg)
kohli
మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది.ఉత్కంఠగా సాగిన పోరులో టీమ్ ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుగ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా..అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్!
కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో చెలరేగి పోగా, శ్రేయస్ 48 పరుగులతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. రాహుల్ 34 నాటౌట్, గిల్ 32 అక్షర్ పటేల్ 29 పరుగులతో అద్భుత విజయాన్ని అందించారు. భారత్ విజయం సాధించడం పట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు.
Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
మ్యాచ్ తరువాత కోహ్లీ మాట్లాడుతూ..ఇది అద్భుత విజయం..కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తరువాత మళ్లీ పుంజుకోవాలని అనుకున్నాం. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలనుకున్నాం.ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం.జూనియర్ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్లుగా అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేస్తుండడం సంతోషంగా ఉంది.
మా అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాం. అయితే వారు తమదైన శైలిలో ఆడుతున్నారు. అదే భారత జట్టును బలంగాతయారు చేస్తోంది. ఒక మంచి జట్టులో భాగమైనందుకుసంతోషంగా ఉంది. ప్రాక్టీస్ సెషన్ లో ఎంతగానో కష్టపడ్డాం.విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు.
సుదీర్ఘమైనకెరీర్ ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో ఆడడాన్ని ఆస్వాదిస్తాం. టైటిల్ గెలవాల్సినప్పుడు జట్టు మొత్తం విభిన్నంగా ఆడాల్సి ఉంటుంది. గత ఐదు మ్యాచ్ ల్లో జట్టులోని సభ్యులు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందుకే ఈ రోజు మేము విజేతలుగా నిలిచాం. పలువురు ఆటగాళ్లు చాలా గొప్పగా వారి ప్రదర్శననిచ్చారు.సమష్టి ప్రయత్నంతో టైటిల్ ను గెలుపొందాం. ఒక బృందంగా ఆడి విజయం సాధించడాన్నిఆస్వాదిస్తున్నాను.ప్రాక్టీస్ సెషన్ లో ,ఫీల్డ్ లో , ఫీల్డ్ బయట మేము ఒక టీమ్ గా ఉండడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది.
గొప్ప స్థానంలో ఉండాలని...
మనం టీమ్ నుంచి వీడేప్పుడు జట్టు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాం. అందుకు ఎంతో కృషి చేసత్ఆం.రాబోయే 8-10 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మా జట్టు ఇప్పటికే సిద్ధమై ఉంది. యువ ఆటగాళ్లలో ఎంతో ప్రతిభ ఉంది.ఎంతోఅవగాహన ఉంది. వారు ఇప్పటికే ఎన్నో వేదికల్లో తమ ప్రదర్శనతో అదరగొట్టారు. గిల్, శ్రేయస్ అద్భుతమైన ఆటగాళ్లు. రాహుల్ ఫినిషర్ గా ఆకట్టుకుంటున్నాడు.హార్దిక్ మ్యాచ్ విన్నర్. ప్రస్తుతం మాకు అద్భుతమైన జట్టు ఉంది.
Also Read: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
Also Read: Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే..