Jay Shah: ఐసీసీ ఛైర్మన్(ICC Chairman) జై షాకు అరుదైన అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. క్రికెట్ ప్రపంచంలో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఇండిపెండెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. దీని మొదటి సమావేశం జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇక ఇందులో ప్రస్తుత కెప్టెన్, మాజీ క్రికెటర్లు, పలువురు పాత్రికేయులకు సలహా మండలిలో చోటి కల్పించారు. ఇండియానుంచి సౌరభ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలకు అవకాశం దక్కింది.
క్రికెట్‌కు చెందిన అన్ని రంగాలు..
ఇక 2024లో క్రికెట్‌కు చెందిన అన్ని రంగాలలోని ప్రభావవంతమైన వ్యక్తులను ఒకచోట చేర్చడంలో అత్యంత ప్రజాదరణ పొందింది ఈ ఫోరమ్. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు సమావేశం నిర్వహించనున్నట్లు WCC తెలిపింది. గత జూలైలో జరిగిన మొదటి ఈవెంట్‌లో క్రికెట్‌లోని 120 మంది సమావేశమయ్యారు. వీరిలో ICC అధికారుతోపాటు క్రికెట్ తో పూర్తి అనుబంధమున్న దేశాల నుండి పలువురు వ్యక్తులు, ప్రముఖ ప్రసారకులు, సాంకేతిక నిపుణులు, కోచ్‌లు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొన్నట్లు వెల్లడించింది.
Momentum continues to build around cricket’s inclusion as an @Olympics sport at the @LA2028 Games and beyond, with @JayShah meeting International Olympic Committee (IOC) President Thomas Bach in Lausanne, Switzerland this week. pic.twitter.com/hiySGMGNPg
— ICC (@ICC) January 21, 2025
ఇది కూడా చదవండి: America: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!
క్లబ్ వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది గేమ్‌లో సమప్యలను చర్చలతో సులభతరం చేస్తుంది. క్రికెట్ భవిష్యత్తు నిర్ధారించే మార్గాలపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడం దీని లక్ష్యం అని డబ్ల్యూసీసీ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరుగాంచిన జైషా.. గత ఏడాది డిసెంబర్ 1న ICC చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: TDS: టీడీఎస్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Also Read : భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు