/rtv/media/media_files/2025/03/21/eb68ebjzhT4rTGJ0BtXx.jpg)
IPL 2025 KKR vs RCB first match rain effect
IPL 2025: మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆరంభంకానుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిమ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే ఛాన్స్ ఉంది. రానున్న ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Let’s give this dashing duo a name, 12th Man Army! 🤩
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 21, 2025
We’ll start first:
Vi-Sa#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/MEwcoGnWHI
మార్చి 20-, 22 మధ్య కురిసే అవకాశం..
ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, నాడియా, బిర్భూమ్, తూర్పు బర్ధమాన్ జిల్లాలతోపాటు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో గంటకు 40-, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు మార్చి 20-, 22 మధ్య కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ మొదలైంది.ఇక ఆరంభ వేడుకల కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేయగా.. బాలీవుడ్ నటి దిశా పటాని, సింగర్ శ్రేయా ఘోషల్ అభిమానులను అలరించనున్నారు.
Also Read: మరో డిజిటల్ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
సంజూ దూరం..
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ కు తొలి మూడు మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్ సారథిగా వ్యవహరించనున్నాడు. వేలి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడతాడని, పూర్తిగా కోలుకున్నాకే వికెట్ కీపింగ్ చేస్తాడని మేనేజ్ మెంట్ తెలిపింది. దీంతో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉండగా.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత సంజూ పూర్తి గేమ్ లోకి దిగుతాడని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
ipl-2025 | kolkata | rain | telugu-news | today telugu news | rtv telugu news | latest-telugu-news