IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు

ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By Manogna alamuru
New Update
ipl

SRH VS RR

ఐపీఎల్ టీమ్స్ లో తూకం వేస్తూ అన్ని జట్లూ కలిపి ఒకవైపు...ఒకే ఒక్క జట్టు ఒకవైసు సమంగా తూగుతాయి. అదే హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు. లాస్ట్ సీజన్ లో కప్ గెలవలేకపోయినప్పటికీ బీభత్సమైన ఆటతో అద్భుతాలు చేసిన సన్ రైజర్స్. వీర బాదుడుకి మారు పేరుగా నిలిచింది. రికార్డుల మోత మోగించింది. నిరుటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో కొత్త రికార్డులు, ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించిన సన్‌రైజర్స్‌.. కొత్త సీజన్లో దండయాత్రకు సిద్ధమైంది. ఈరోజు సొంత స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ఢీకొనడానికి రెడీ అయింది. 

దుర్భేద్యంగా ఉన్న సన్ రైజర్స్..

బ్యాటింగ్, బౌలింగ్ లలో అత్యంత పటిష్టంగా ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్ జట్టు.  ఇదే జోష్ తో ఈరోజు రాజస్థాన్ యాల్స్ మీద మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. మరోవైపు కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ లోనే టఫ్ ఫైట్ కు సిద్ధమైంది. ఆ టీమ్ కు హైదరాబాద్ ను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. 

గతేడాది అత్యంత హైస్కోర్లతో హోరెత్తించిన సన్ రైజర్స్ ఈసారి 300 మైలు రాయిని చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. నిరుడు ఒక్క సీజన్‌లోనే మూడు సార్లు 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేసింది. ఊచకోత ప్రత్యర్థి జట్లలో దడ పుట్టేలా చేసింది. క్రితం సారి లాగే ఈసారి కూడా ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్‌ హెడ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్, ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డిలు వీర విహారం చేడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటూ  టీమ్ లో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్, మహ్మద్‌ షమి రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు ఉండటం కూడా అదనపు బలంగా ఉంది. వీరికి తోడుగా పేసర్లు జైదేవ్‌ ఉనద్కత్, హర్షల్‌ పటేల్‌...ఆడమ్‌ జంపా, రాహుల్‌ చాహర్‌ల స్పిన్‌ మాయాజాలంతో సన్‌రైజర్స్‌కు తిరుగులేని టీమ్ గా ఉంది. 

అత్యంత వీక్ గా రాజస్థాన్..

మరోవైపు ప్రారంభానికి ముందే కెప్టెన్ సంజూ శాంసన్ కు గాయమవడంతో రాజస్థన్ రాయల్స్ డీలా పడిపోయింది. ఇతను వికెట్ కీపింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక కెప్టెన్ గా సంజూ స్థానంలో రియాగ్ పరాన్ వచ్చి చేరాడు. ఇనికి ఇదే మొదిసారి కెప్టెన్సీ. దీంతో ఏ మేరకు టీమ్ ను నడిపిస్తాడో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇవన్నీ అలా ఉంటే ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను వేలం పాటకు ముందు వదిలేసుకోవడంతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ అయిపోయింది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ను మినహాయిస్తే పరాగ్, షిమ్రన్‌ హెట్‌మైర్, ధ్రువ్‌ జురెల్, నితీశ్‌ రాణాలు ఎలా ఆడతారో ఎవరికీ పెద్దగా తెలయదు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే జోఫ్రా ఆర్చర్‌ ఆధ్వర్యంలోని సందీప్‌శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, ఫజల్‌హక్‌ ఫారూఖీ, మహీశ్‌ తీక్షణ, వనిందు హసరంగలు బౌలర్లుగా ఉన్నారు. వీరి మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచే ఛాన్స్ ఉందని స్పోర్ట్స్‌ నిపుణులు చెబుతున్నారు.

 today-latest-news-in-telugu | ipl-2025 | srh | rr | hyderabad | uppal 

Also Read: USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు