Rohith Sharma: టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. హిట్ మ్యాన్‌తో పాటు మరో ముగ్గురికి చోటు

టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ 2024లో మొత్తం నలుగురు క్రికెటర్లకి చోటు లభించింది. రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ,పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 378 పరుగులు చేశాడు.

New Update
Hit man Rohith

Hit man Rohith Photograph: (Hit man Rohith)

Rohith Sharma: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)  శనివారం పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ 2024ని ప్రకటించింది. ఇందులో కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. గతేడాది రోహిత్ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024(India T20 World Cup 2024)ను గెలిచింది. అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ నిలిచింది. అయితే ఈ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌‌లో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

మొత్తం నలుగురు ఆటగాళ్లకు..

రోహిత్‌ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ,పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు లభించింది. అలాగే పాకిస్థానీ ప్లేయర్ బాబర్ ఆజంకు కూడా చోటు దక్కింది. వీరితో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, వెస్టిండీస్‌లకు చెందిన ఒక్కో ఆటగాడికి చోటు లభించింది. 

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

టీ20లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండటంతో పాటు ఓపెనర్‌‌గా కూడా ఉన్నాడు. గతేడాది 11 టీ20 మ్యాచ్‌లలో 42.00 సగటున 160.16 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను భారత్ ముద్దాడింది. ఈ టోర్నీ తర్వాత రోహిత్ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు, వన్డే జట్టుకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బుమ్రా గతేడాది 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు