Rare Half FemaleHalf Male Bird: అరుదైన సగం మగ, సగం ఆడ పక్షిని కనుగొన్న శాస్త్రవేత్తలు

చాలా అరుదైన పక్షిని కనుగొన్నారు న్యూజిలాంగ్ శాస్త్రవేత్తలు. వందేళ్ళల్లో ఇలాంటి బర్డ్‌ను చూడ్డం ఇదే రెండోసారి అని చెబుతున్నారు. సగం ఆడ, సగం మగ లక్షణాలు కలిగిన అద్భుతమైన పక్షి కనిపించిందని చెబుతున్నారు.

New Update
Rare Half FemaleHalf Male Bird: అరుదైన సగం మగ, సగం ఆడ పక్షిని కనుగొన్న శాస్త్రవేత్తలు

Rare Bird:మనుషుల్లో ఆడ, మగ కానివారు ఉంటారు. సగం, సగం లక్షనాలు కలిగిన వారిని మనం చాలా మందినే చూస్తుంటాం. అది మనకు చాలా సహజం కూడా. కానీ జంతువులకు, పక్షులకు మాత్రం ఇది కొత్తే వాటిల్లో ఇలాంటి లక్షణాలు కలిగినవి చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అందుకే అలాంఆవి ఎప్పుడైనా కనిపిస్తే అదొక పెద్ద వార్తే అవుతుంది. ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. వీటిని గైనండ్రోమోర్ఫిక్ బర్డ్ అని పిలుస్తారుట. ఈ పక్షి సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ ఉన్నవైపు ఆడ లక్షణాలు, నీలం ఉన్న వైపు మగలక్షణాలు ప్రదర్శిస్తుందిట.

Also Read:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా అవయవాలు కూడా కలిగి ఉంటాయి. అలాగే మరోక వైపు ఆడ ఈకలు ఉండి స్త్రీ జాతి పక్షుల్లో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా ఉంటాయిట. అంతేకాదు దీంతో పాటూ ఈ పక్షిలో కణలు కూడా ఆడ, మగ కింద విభజింపబడతాయి అని చెబుతున్నారు. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా నిజమని చెబుతున్నారు. అందుకే ఇలాంటి పక్షులు చాలా అరుదుగా ఉంటాయని అంటున్నారు. ఇవి బతికినన్నాళ్ళు ఇవే కణాలతో కొనసాగుతాయని వివరిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ఇంతవరకు ఇలాంటి పక్షిని చూడలేదని హమీష్ చెబుతున్నారు.

ఈ పక్షికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ పీల్డ్ ఆర్నిథాలజీ ప్రచరించారు. ఇలాంటి పక్షి వందేళ్ళల్లో రెండోసారి కనిపించిందని అంటున్నారు. పక్షుల్లో స్త్రీకణ విభజన సమయంలో ఏర్పడే లోపం వలన ఇలాంటి పక్షులు పుడతాయని వివరిస్తున్నారు. పక్షుల్లో ఒక గుడ్డు రెండు స్పెర్మ్‌ల ద్వారా ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ హమీష్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు