/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు బెదిరింపులు రావడం తాజాగా కలకలం సృష్టిస్తుంది. ట్రంప్ ను హతమార్చుతానంటూ షాన్‌మోన్పర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
తనను తాను మిస్టర్ సాతాన్ గా పేర్కొన్న మోన్పర్ బట్లర్ టౌన్ షిప్ కి చెందినవాడు. అతడు యూట్యూబ్ లో పలు వీడియోలు పోస్టు చేశాడు. అందులో ట్రంప్, డోజ్ శాఖ సారథి మస్క్ తో సహా ఇతర అధికారుల పేర్లను ప్రస్తావించారు. తమ దారికి అడ్డుగా వారందరినీ హతమార్చుతానంటూ ఒక వీడియోలో తెలిపాడు.
Also Read: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
ఈ క్రమంలో మార్చి 4న పోస్టు చేసిన మరో వీడియోలో..ట్రంప్ ను హత్య చేసేది తానేనని పేర్కొన్నాడు. ఈ వీడియోలు కాస్త అధికారుల దృష్టికి రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
ఆ నిందితుడితో షాన్‌కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక...జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్ది సేపటి ముందే నిందితుడు ఓ తుపాకీ కొనుగోలు చేశాడట. అధికారం చేపట్టాక మరికొన్ని తుపాకీలు, మందు సామగ్రిని సైతం కొనుగోలు చేసినట్లు తెలిసింది.హత్య లేదా సామూహిక హింసకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టమని అటార్నీ జనరల్ పామ్ బోండీ పేర్కొన్నారు.
షాన్ కు తగిన శిక్ష పడుతోందన్నారు. కాగా..గతేడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ భవనం పై నక్కిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి గాయమైంది. వెంటనే స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో రావడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం కాల్పులు జరిపి అతడిని అరెస్ట్ చేశారు.
Also Read: Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
trump | murder | attempts | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | america | arrest