Movies: మీ పిచ్చి తగలెయ్య..హీరోల కోసం మీరెందుకు కొట్టుకుంటున్నార్రా..

హీరో ఫ్యాన్స్ మధ్య వార్ హద్దులు దాటింది. మాటలతో సరిపోలేదు కాబోలు చేతలకు దిగారు. మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ వీరంగం వేశారు. బెంగళూరులో తమ హీరో అల్లు అర్జునే గొప్పోడంటూ పదిమంది కలిసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను చితక్కొట్టిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

New Update
Movies: మీ పిచ్చి తగలెయ్య..హీరోల కోసం మీరెందుకు కొట్టుకుంటున్నార్రా..

Allu Arjun - Prabhas Fans War: హీరోలు, ఫ్యాన్స్...అభిమానం ఉండడం...అది ఒకప్పుడు హద్దుల దాటడం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్‌లు చూస్తూనే ఉన్నాం. కానీ సోషల్ మీడియా వచ్చాక ఈ పిచ్చి మరికొంచెం ఎక్కువైపోయింది. ఇప్పుడు అది మరింత ముదిర ఇపాకాన పడింది. ఫ్యాన్స్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా కొట్టుకునే స్థాయికి వచ్చింది. ఫ్యాన్స్ మధ్య గొడవ మాటల వరకు అయితే పర్వాలేదు కానీ..చేతల విషయానికి వస్తేనే ప్రమాదం అంతా. ఆన్లైన్‌లో మొదలైన గొడవలు...రోడ్డున పడుతున్నాయి.

అభిమానానికి ఒక లిమిట్ ఉంటుంది..

ఇంతకు ముందు కూడా ఇలా గొడవలు పడ్డ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఇలాంటి గలాటాలు ఎక్కువగా చేస్తుంటారు. మహేష్‌ బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇప్పుడు ఈ జబ్బు అల్లు అర్జున్ ఫ్యాన్‌కు కూడా అంటుకుంది. హీరోలు కేవలం సినిమాలో నటించేవాళ్ళు మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళేదో నిజంగానే దేశానికి సేవ చేసే వాళ్ళల్లా ఫీల్ అయిపోతుంటారు ఈఫ్యాన్. అభిమానం ప్రదర్శించే మత్తులో మనుషులమనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఇంతా చేస్తే హీరోలు బాగానే ఉంటారు. హాయిగా కలిసి మెలిసి తిరుగుతూ పార్టీలు చేసుకుంటుంటారు. కానీ ఈ పిచ్చి ఫ్యాన్సే హద్దులు మర్చిపోతుంటారు. నిజానికి పాపం హీరోలు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెబుతుంటారు. తామందరం ఒకటేనని...మా కోసం అభిమానులు కొట్టుకోవద్దని. కానీ ఈ పిచ్చి ఫ్యాన్స్ వింటేనే కదా.

హద్దులు దాటిన అభిమానం..

తాజాగా బెంగళూరులో ఒక ప్రభాస్ ఫ్యాన్‌ను చితకొట్టారు అల్లుఅర్జున్ అభిమానులు. పదిమంది ఒక్కడిని చేసి బాదేశారు. రక్తం వచ్చేలా ప్రభాస్ ఫ్యాన్ ని కొట్టి, ఇంకోసారి మా అల్లు అర్జున్ జోలికి వస్తే ఇలాగే జరుగుద్ది అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఈ పోస్ట్‌ను కొంతమంది బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. విచక్షణా రహితంగా ఒక్కడిని చేసి చితకబాదిన ఆ పది మందిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. దీని మీద పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఆ పది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేసారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.

Also Read:Vande Bharat: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Anasuya: మరో కొత్త అవతారమెత్తిన అనసూయ.. ఇదేదో డిఫరెంట్ గా ఉందే!

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో మరో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. ట్రెడిషనల్ కమ్ వెస్టర్న్ అవుట్ ఫిట్ స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment