SC, ST Reservations: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

New Update
SC, ST Reservations: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..

Creamy Layers in SC/ST Reservation: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అనుమతిస్తూ ఇటీవలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్లకు క్రిమీ లేయర్‌ను కూడా వర్తింపజేయాలని ఈ తీర్పు వెలువరించిన నలుగురు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సూచించినదాన్ని పరిగణలోకి తీసుకోకూడదనే అభిప్రాయానికి వచ్చింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీలకు క్రిమీ లేయర్ నిబంధన లేదని.. అందుకే దీన్ని అమలుచేయకూడదని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు.

క్రిమీ లేయర్‌ అంటే
క్రిమీ లేయర్‌ అంటే ఒక కులంలో సంపన్న కుటుంబాలను క్రిమీ లేయర్‌గా భావిస్తారు. ప్రస్తుతం ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు ఈ క్రీమీ లేయర్‌ను అమలు చేస్తున్నారు. అంటే ఓబీసీ వర్గాల్లో ఏడాదికి రూ.8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు వర్తించవు. దీంతో ఈ వర్గాలను జనరల్‌ కేటగిరీ మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. వీళ్లలో కూడా ఈ క్రీమీ లేయర్‌ వర్గాలను మినహాయించాల్సి అవసరం ఉందని నలుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని నిర్ణయించింది.

Also Read: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో కోటీ ఇళ్లు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణాల్లో EWS ఇళ్లు పొందేందుకు రూ.3 లక్షలు, ఎల్‌జీ ఇళ్లు పొందేందుకు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు, అలాగే ఎంఐజీ ఇళ్లు పొందడానికి రూ.9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే లోన్‌లలో తొలి రూ.8 లక్షలపై 12 ఏళ్ల వరకు 4 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. గరిష్ఠంగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షల సబ్సిడీ ఇస్తారు. ఇక పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు ఒక్కో యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సమకూరుస్తుంది.

రైతులను క్వాలిటీ నర్సరీ మొక్కలు అందించేందుకు రూ.1,765.57 కోట్లతో క్లీన్‌ప్లాంట్‌ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా ఉద్యానవనాలకు అవసరమైన సాయం అందించి నాణ్యమైన మొక్కలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల కస్టమర్లకు వైరస్‌ లేని మంచి మొక్కలు అందుబాటులోకి రావడంతో పాటు మొక్కల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు