PM Modi: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ

వక్ఫ్‌ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్‌ నిబంధనలను తమ స్వార్థానికి మార్చేసిందని ఆయన ఆరోపించారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటున్నారని విమర్శించారు.

New Update
PM Modi

PM Modi

వక్ఫ్‌ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింలు పలు చోట్ల నిరసనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వీరికి మద్దతుగా నిలుస్తోంది. అయితే తాజాగా ప్రధాని మోదీ ఈ నిరసనలపై స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్‌ నిబంధనలను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపణలు చేశారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు వాళ్ల పార్టీలో ఉన్నత స్థానాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 

Also Read: 3 రాష్ట్రాలు..700సీసీ కెమెరాలు..దొరికిన బెంగళూరు లైంగికవేధింపుల కేసు నిందితుడు

అలాగే ముస్లిం అభ్యర్థులకు 50 శాతం ఎన్నికల టికెట్లను ఎందుకు రిజర్వ్ చేయలేదని ప్రశ్నించారు. హర్యానాలోని హిస్సార్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్పూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అధికారం పొందడం కోసం వాడుకుంటోందని విమర్శలు చేశారు.  

Also Read :  నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సంచలన కామెంట్స్!

PM Modi - Waqf Attack

ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగ స్పూర్తిని హత్య చేశారంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే విపక్ష నేతలు ఎప్పుడూ కూడా వాటిని పాటించలేదని విమర్శించారు. ఇదిలాఉండగా ఇటీవల ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలైన ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

దీనిపై మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా.. ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపనుంది. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. ఇది ఆర్టికల్ 14, 25, 26ని ఉల్లంఘించడమే అవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముస్లింలు వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు వ్యక్తులు వ్యక్తులు మృతి చెందారు. చివరికి పోలీసులు 110 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read :  మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

Waqf Bill 2025 | rtv-news | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment