Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

New Update
FotoJet (6)

Vijay-Rashmika's wedding..Celebrations across the country

Vijay-Rashmika:  టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న(Vijay Devarakonda - Rashmika) లు వివాహ బంధంతో   ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికలు ఒకేరోజున రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం జరిగిన విషయం తెలిసిందే. మరునాడు హైదరాబాద్‌ తిరిగి వచ్చిన వారు విజయ్‌ సొంత గ్రామానికి వెళ్లారు. అయితే మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. ఈ కార్యక్రమానికి రాజకీయ, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దీనికి ముందు  వీరోష్‌  జోడీ మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Also Read :  TVK విజయ్ కు బిగ్ షాక్.. విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్య!

Vijay-Rashmika's Wedding Celebrations Across The Country

కాగా ఇప్పటివరకు దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గ్రాండ్‌ గా పెళ్లి చేసుకున్నప్పటికీ  విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న(Rashmika-Vijay Marriage) లు మాత్రం తమ వివాహాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. తమ వివాహా వేడుకను నాలుగు కాలాల పాటు గుర్తుండేలా చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో ఏ సెలబ్రిటీ కపుల్ ఆలోచించని విధంగా ఈ జంట కొత్తగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ జంట. దేశవ్యాప్తంగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించేలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు.  తమను ఈ స్థాయికి తీసుకొచ్చిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఈ ప్లాన్ చేస్తున్నట్లు విరోష్ జంట తెలిపింది. దీనికి సంబంధించి వారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

వారు తెలిపిన ప్రకారం "దేశ ప్రజలంతా మా జీవితంలో భాగం. అందుకే మీ అందరితో ఈ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎలాంటి ఈవెంట్ నైనా మనదేశంలో స్వీట్స్(sweets), ఫుడ్‌(food) తో సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మా జీవితంలో అత్యంత ముఖ్యమైన మూవ్‌మెంట్‌ను మీతో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాం. దీనిలో భాగంగా మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం. అలాగే ప్రముఖ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని విజయ్ - రష్మిక(Rasmika Mandana) వెల్లడించారు. ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు.. ఏయే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు అనే లిస్ట్‌ను కూడా విరోష్ జంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Also Read :  సైజ్ జీరోపై మృణాల్ ఠాకూర్ హాట్ కామెంట్స్ వైరల్!

స్వీట్స్ పంపిణీ ఎక్కడంటే: తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌... ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, పుట్టపర్తి.. ఢిల్లీ, చండీగఢ్..  మహారాష్ట్రలోని ముంబైలో... రాజస్థాన్‌లోని జైపూర్‌లో.. కేరళలోని కొచ్చిలో.. కర్ణాటకలోని మైసూర్, కూర్గ్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్..తమిళనాడులోని కోయంబత్తూరు, చెన్నై... పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అన్నదానం జరిగే ఆలయాలు:మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయం (మహబూబ్ నగర్), హరేకృష్ణ హెరిటేజ్ టెంపుల్ (హైదరాబాద్), చింతపల్లి సాయిబాబా ఆలయం (చింతపల్లి),  కనక మహాలక్ష్మీ ఆలయం (విశాఖపట్నం), కనకదుర్గ ఆలయం (విజయవాడ), ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి), శివోహం ఆలయం (బెంగళూరు), శ్రీ చాముండేశ్వరి ఆలయం (మైసూరు), రాధ కృష్ణ ఆలయం (బెంగళూరు), అరుల్ కోమిలమ్మ తిరుకోయిల్ (కోయంబత్తూరు) ,  గోవింద దేవ్ జీ టెంపుల్ (జైపూర్), పాడి ఇగుత్తప్ప టెంపుల్ (కూర్గ్), శ్రీశ్రీ గోవింద దామ్ టెంపుల్ ఇస్కాన్ (అహ్మదాబాద్), శ్రీ రుక్మీణి టెంపల్ (గౌహతి), శ్రీశ్రీ కృష్ణ బలరామ్ మందిర్ (బృందావనం)

Advertisment
తాజా కథనాలు