/rtv/media/media_files/2025/02/26/YzXJP6mof5s8jDAy6I9P.jpg)
PM Modi and Tamil nadu CM Stalin
DMK Vs BJP: దేశంలో భాషా వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడులో ఎలాగైనా హిందీ అమలు జరగాల్సిందేనని కేంద్రం భావిస్తోంది. అయితే అందుకు అవకాశం లేదని, హిందీ భాషను అమలు చేసేదేలేదంటూ తమిళనాడు డీఎంకే సర్కార్ కరాకండిగా చెబుతోంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అన్నాడీఎంకే సైతం కేంద్రం పెత్తనం ఏమిటనే వాయిస్ వినిపిస్తోంది. అయితే త్రి భాషా వివాదం రగులుతున్న సమయంలో అనూహ్యంగా గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఇందులోకి లాగారు. భాషల రాజకీయ యుద్ధంలోకి పిచాయ్‌ను ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Learnt about DMK Minister Thiru @ptrmadurai avl’s response to my question yesterday on the hypocrisy of DMK Ministers allowing their children/ grandchildren to learn three languages in school while compelling Govt school students to learn only two languages.
— K.Annamalai (@annamalai_k) March 13, 2025
Thiru PTR Palanivel… pic.twitter.com/X5BFhGghrw
1968 నుంచి వివాదం మొదలు..
ఈ మేరకు కేంద్రంపై పోరాటానికి తమిళ పార్టీలు ఎల్లప్పుడు ముందే ఉంటాయి. ముఖ్యంగా భాష విషయంలో అసలే వెనకడుగు వేయకపోగా.. హిందీ భాషను 1968 తమిళనాడులో ప్రవేశ పెట్టాలనుకుంటే అప్పుడు ఓ యుద్ధమే జరిగింది. తాజాగా కేంద్రం త్రి భాషా విధానాన్ని వ్యతిరేస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సమానికి సై అంటున్నారు. కానీ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాత్రం.. హిందీ ఎందుకు కావాలో తెలుపుతూ సుందర్ పిచాయ్‌కి చెందిన ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పాఠశాలలో తాను హిందీని ఎలా నేర్చుకున్నానో అందులో ఆయన చెప్పుకొచ్చారు. తన ఎదుగుదలకు హిందీ కూడా ఓ కారణమని ఆ వీడియోలో చెప్పకనే చెప్పారు. టెక్ దిగ్గజం మూడు భాషలు నేర్చుకోగలిగితే, అదే అవకాశం రాష్ట్రంలోని అన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండాలని అన్నామలై అన్నారు. మంత్రుల పిల్లలు, మనవరాళ్ళు పాఠశాలల్లో మూడు భాషలు నేర్చుకోవడానికి అనుమతిస్తూ.. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు మాత్రం రెండు భాషలు మాత్రమే నేర్చుకోవాలని బలవంతం చేయడం దారుణమని అన్నామలై ఆరోపించారు.
Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు!
అన్నాడీఎంకే మద్ధతు..
అయితే ఇది డీఎంకే, బీజేపీ మధ్య యుద్ధమే అయినా.. తమిళ సెంటిమెంట్ అంశంగా ఈ వివాదం రగులుతోంది. ఈ వివాదంలో సైలెంట్ గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటు డీఎంకేకు ప్లస్ గా మారుతుంది అనే కారణంతో తమిళనాడులోని మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ డీఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీని స్థాపించి డీఎంకేను పదేపదే వ్యతిరేకిస్తున్న నటుడు విజయ్ పార్టీ సహా.. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయిన అన్నాడీఎంకే కూడా డీఎంకే వాదనను బలపరుస్తోంది. తమిళులపై ఉచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంటులో మోషన్ కూడా డీఎంకే దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇపుడు ఇదే అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పటికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై