Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు!

పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. 

New Update
delhi former

Supreme Court Praised farmer Jagjit Singh Dallewal struggle

Delhi:  పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, రైతులకు మంచి చేయాలనే తప్ప ఎలాంటి రాజకీయ అజెండా లేదని కీర్తించింది.  నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని  పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. 

Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

ఈ మేరకు రైతుల డిమాండ్ల సాధన కోసం జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరిస్తూ శుక్రవారం తన దీక్షను విరమించారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఖనౌరి, శంభు సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న వారిని చెదరగొట్టి రహదారులను తెరిచినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రైతుల డిమాండ్ల సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన దల్లేవాల్‌ను న్యాయస్థానం అభినందించింది. అతనికి రైతులకు మంచి చేయాలనే ఆలోచన తప్పా రాజకీయ అజెండా లేదని వ్యాఖ్యానించింది. 

Also Read: కుణాల్‌ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

అతడు నిజమైన కర్షకుడు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన నివేదికను సమర్పించండి అంటూ పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. రైతుల ఫిర్యాదులను పరిశీలించి, అక్కడి పరిస్థితిని తెలియజేసే నివేదికలను దాఖలు చేయాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీకి సూచించింది. దల్లేవాల్‌‌కు వైద్యసహాయం అందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించనందుకు పంజాబ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌పై విధించిన కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

 punjab | formers-protest | supreme-court | telugu-news | today telugu news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు