Akilesh Yadav: "దీదీ.. మీరు ఓడిపోలేదు".. మమతకు అఖిలేష్ యాదవ్ భరోసా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిశారు.

New Update
SP Chief Akilesh Yadav Meets Mamata benarjee in kolkata

SP Chief Akilesh Yadav Meets Mamata benarjee in kolkata

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక(West Bengal Assembly elections) ల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(akhilesh-yadav) గురువారం కోల్‌కతాలో మమతా బెనర్జీ(mamata-benarjee) ని కలిశారు. ఆమెకు తన నైతిక మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మమతతో మాట్లాడారు. "దీదీ, మీరు ఓడిపోలేదు" అని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్, మమతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read :  షాకింగ్ ఘటన.. ఈడీ సోదాల భయంతో రోడ్డుపై విసిరేసిన రూ.500 నోట్ల కట్టలు

SP Chief Akilesh Yadav Meets Mamata Banerjee

అసెంబ్లీ ఎన్నికల్లో జరిపిన పోరాటంలో టీఎంసీ ప్రదర్శించిన తీరును అఖిలేష్ కొనియాడారు. అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి మీరందరూ అద్భుతమైన పోరాటం చేశారంటూ ప్రశంసించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటడం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై అఖిలేష్, మమతా బెనర్జీల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read: బెంగాల్ ఎన్నికల రక్త చరిత్ర.. ఒకటి కాదు రెండు కాదు.. వందలమంది దారుణ హత్య!

ఇదిలాఉండగా బెంగాల్ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. ఇక టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో 'ఇండియా' కూటమిని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ లాంటి కీలక నేతలు ఆమెకు సపోర్ట్‌గా ఉండటం విపక్ష కూటమిలో కొత్త చర్చకు దారితీసింది.

Advertisment
తాజా కథనాలు