Crime News: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ

ఝార్ఖండ్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లోనే నిర్బంధించి కుంభమేళా యాత్రకు వెళ్లాడు. తిండి లేక ఆకలితో ఆ వృద్ధురాలు అల్లాడిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Son locks elderly mother at home to attend Maha Kumbh in Prayagraj

Son locks elderly mother at home to attend Maha Kumbh in Prayagraj

Crime News: ఝార్ఖండ్‌(Jharkhand)లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లోనే నిర్బంధించి కుంభమేళా యాత్ర(Kumbh Mela Yatra)కు వెళ్లాడు. తిండి లేక ఆకలితో ఆ వృద్ధురాలు అల్లాడిపోయింది. చివరికి ఇరుగుపొరుగున వారు ఆమె కేకలు విని రక్షించారు. రామ్‌గఢ్‌ జిల్లా(Ramgarh District)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. దీంతో తన తల్లిని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి తాళం వేసి కుటుంబంతో కలిసి అతడు కుంభమేళా యాత్రకు వెళ్లాడు. 

Also Read:  రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?

ఆకలికి తట్టుకోలేక కేకలు..

అన్నం, నీళ్లతో 3 రోజుల పాటు ఆ వృద్ధురాలు ఇంట్లోనే గడిపారు. చివరికి ఆ ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోవడంతో ఆమె ఆకలితో అలమటించారు. రోజులు గడుస్తున్నా కూడా ఆమె కుటుంబం ఇంకా ఇంటికి రాలేదు. దీంతో ఆకలికి తట్టుకోలేక ఆమె కేకలు వేసింది. అది విన్న చుట్టుపక్కల స్థానికులు వృద్ధురాలు ఉంటున్న ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టాక ఇంట్లో ఆమెను చూసి షాకైపోయారు. 

Also Read: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!

ఆకలికి తట్టుకోలేక ఆ వృద్ధురాలు చివరికి ప్లాస్టిక్‌కు తినేందుకు కూడా యత్నించగా వాళ్లు అడ్డుకున్నారు. ఆమెకు నీళ్లు, ఆహారం అందించారు. వృద్ధురాలి పరిస్థితి గురించి ఆమె కూతురుకు చెప్పారు. అలాగే సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బలహీనంగా ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె కొడుకు మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. తాము వెళ్లేముందు ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించి వెళ్లామని.. అప్పుడు తన తల్లి ఆరోగ్యంగా ఉందంటూ చెప్పాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. 

Also Read: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Encounter: ఛత్తీస్ ఘడ్ లోమళ్ళీ ఎన్ కౌంటర్..అగ్రనేతలు హతం

ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు పేలాయి. కొండగావ్..నారాయణ పుర్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు  చేపట్టారు. ఆ క్రమంలో మావోయిస్టులపై కాల్పులు జరిపారు. 

New Update
Operation Kagar..

Operation Kagar..

ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది.  కొండగావ్..నారాయణ్ పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించడంతో కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్యనా ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే అందులో ఇద్దరినీ మాత్రం పోలీసులు మట్టుబెట్టారు. 

ఇద్దరు అగ్రనేతలు..

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలను, ఏకే 47 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన వారు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పేర్లు ఇంకా ఏంటన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు చేస్తున్నారు. దాదాపు ఈ రోజంతా గాలింపు కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజన్ తెలిపారు. 

encounter | police | maoists | today-latest-news-in-telugu

Also Read: USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్

Advertisment
Advertisment
Advertisment