/rtv/media/media_files/2025/03/23/chUBrcKNuGRmhnAQzuBZ.jpg)
Samyukta Kisan Morcha calls for nationwide farmers protest
SKM: పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతుల నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పాలిత పంజాబ్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిలో పనిచేస్తుందని SKM ఆరోపించింది. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి, నిరసన తెలిపే హక్కును కాపాడటానికి అన్ని రైతు సంఘాలు కదిలిరావాలని మోర్చా పిలుపునిచ్చింది.
జాతీయ వ్యవసాయ విధాన వ్యతిరేక చట్టం..
ఈ మేరకు పంజాబ్‌లో రైతులపై పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ C2+50% ఫార్ములా కింద కనీస మద్దతు ధర (MSP) అమలు, వ్యవసాయ రుణ మాఫీ, జాతీయ వ్యవసాయ విధాన వ్యతిరేక చట్టం (NPFAM) అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. పంజాబ్ ప్రభుత్వం ఇటీవలే శంభు, ఖనౌరి సరిహద్దుల నుండి నిరసన తెలుపుతున్న రైతులను తొలగించింది. వన్-వే రోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మెలు, భారీ కాంక్రీటును పూర్తిగా తొలగించారు. దీంతో పంజాబ్ నుండి హర్యానా వరకు రోడ్డు మార్గం దాదాపుగా క్లియర్ అయింది.
Also read: నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
అంతేకాకుండా అన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ కూడా పునఃప్రారంభించబడింది. అయితే ఈ మార్గాలు దాదాపు 13 నెలలు మూసివేయబడిన విషయం తెలిసిందే. కాగా రైతు ఉద్యమానికి సంబంధించి పాటియాలా రేంజ్ డిఐజి మన్దీప్ సింగ్ సింధు పెద్ద ప్రకటన చేశారు. రైతులు మళ్లీ ఆందోళన ప్రారంభిస్తే, పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఖనౌరి సరిహద్దు నుండి రైతులను తొలగించే ప్రణాళికను 'క్లీన్ స్వీప్' కింద రూపొందించినట్లు కూడా ఆయన చెప్పారు. ఖనౌరి సరిహద్దు వద్ద దాదాపు 600 మంది రైతులు ఉన్నారని, వారిలో 400 మందికి పైగా రైతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రైతుల ట్రాక్టర్ ట్రాలీలను సురక్షితమైన స్థలంలో ఉంచాం. రైతులు తమ వాహనాలను తిరిగి తీసుకోవడానికి పత్రాలు, సాక్షాలతో రావాలని సూచించారు.
Also read: Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్
punjab | protest | formers | telugu-news | latest-telugu-news | today telugu news | rtv telugu news