Rahul Gandhi: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ

AI విషయ పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. దురదృష్టవశాత్తూ మోదీ ప్రసంగాలకే పరిమితమయ్యారని విమర్శలు గుప్పించారు. టెక్నాలజీలో భారత్‌కు బలమైన పునాది కావాలన్నారు. 

New Update
Rahul Gandhi : బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి.. విపక్షాల ఒత్తిడికి వెనక్కి తగ్గిన కేంద్రం

Rahul Gandhi shocking comments on Modi

Rahul Gandhi: AI విషయ పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. భాతర ప్రధాని కృత్రిమమేధ, సాంకేతికతను అర్థం చేసుకోకపోతున్నారని విమర్శించారు. డ్రోన్ టెక్నాలజీ పనితీరును వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రాహుల్ గాంధీ.. కొత్త సాంకేతికతను రూపొందించడానికి బలమైన పునాది కావాలన్నారు. 

వట్టి మాటలు చాలు.. 

ఈ మేరకు ప్రపంచ యుద్ధరంగంలో డ్రోన్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్‌లు రణ భూమిలో కమ్యూనికేట్‌ అవుతున్నాయి. కేవలం ఇదొక సాంకేతికత మాత్రమే కాదు.. బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు కూడా. దురదృష్టవశాత్తూ మోదీ ఈ విషయాన్ని గ్రహించడంలో వెనకబడ్డారు. AIపై టెలీప్రాంప్టర్‌లో ప్రసంగాలు చేస్తుంటే మన పోటీ దేశాలు మాత్రం న్యూ టెక్నాలజీని సృష్టించి ముందుకెళ్తున్నాయి. వట్టి మాటలు కాదు. బలమైన పునాది కావాలన్నాడు. 

ఇది కూడా చదవండి: Kiran-Laxmi: పవన్ అండతోనే కిరణ్ రాయల్ అరాచకాలు.. సంచలనాలు బయటపెట్టిన లక్ష్మి!

ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో AI యాక్షన్‌ సమ్మిట్‌ మెక్రాన్‌తో కలిసి మోదీ అధ్యక్షత వహించారు. AIతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనల వట్టి పుకారే అన్నారు. టెక్నాలజీ వల్ల ఉపాధి కోల్పోమని, తన రూపాన్ని మాత్రమే మార్చుకుంటుందని చెప్పారు. టెక్నాలజీ పెరిగితే కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అదొక కొత్త హిస్టరీ అవుతోందని మోదీ అన్నారు. 

ఇది కూడా చదవండి:  BIG BREAKING : తెలంగాణలో " సీఎం" మార్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు