Rahul Gandhi: భారత విద్యారంగంపై రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్‌(RSS) దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మహులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భాగవత్‌ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృ‌తి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇవి దేశంలో స్వాతంత్ర్యం పూర్వం ఉన్న పరిస్థితులను కోరుకుంటున్నాయి. దళితులు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా చేస్తున్నాయి. రాజ్యంగా మారిపోయిన రోజు ప్రజలకు ఇక ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.  

Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు..

ప్రైవేటు వ్యవస్థలో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది. మన దేశ విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయింది. సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇదంతా పచ్చి అబద్ధం. ఇలా చేస్తే మీ పిల్లలకు దేశంలో ఎలాంటి ఉపాధి లభించదు. దేశ ఉపాధి వ్యవస్థను బిలియనీర్లు నాశనం చేస్తున్నారని'' రాహుల్ గాంధీ అన్నారు.  

Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?

Also Read:  రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment