ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..?

రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు.

author-image
By K Mohan
New Update
rahul gandhi drone

rahul gandhi drone Photograph: (rahul gandhi drone )

కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతున్నారు. రాహుల్‌ గాంధీ శనివారం ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ఆయన భారత్ నిషేధించిన చైనా డ్రోన్ ఎగరేశారు. 2022లో భారత్‌ నిషేధించిన చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన డీజేపీ టెక్నాలజీ కంపెనీ తయారు చేసిన డ్రోన్‌‌పై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

డ్రోన్లు తయారు చేయాడానికి మంచి ఫ్యాక్టరీ అవసరమని గాంధీ తెలిపారు. మాటలతో వాటిని తయారు చేయాలేరని ఆయన మోదీకి కౌంటర్ ఇచ్చారు. డ్రోన్‌లు కేవలం ఒక సాంకేతికత కాదు, అవి బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయిన ఆవిష్కరణలని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు దీనిని గ్రహించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన ఏఐపై టెలిప్రాంప్టర్ ప్రసంగాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. డ్రోన్ల భాగాలు దేశంలో తయారు కావడం లేదని, ఆప్టిక్స్ గురించి కూడా మన దేశంలో అవగాహన లేదని ఆరోపించారు.

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను డ్రోన్ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు స్మిత్ షా ఖండించారు. భారత డ్రోన్ పరిశ్రమను అవమానించేలా నిషేధిత చైనీస్ డ్రోన్‌ను గర్వంగా ప్రదర్శించడాన్ని విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీపై రాహుల్ గాంధీ మాటలను తప్పుబట్టారు ఆయన. ప్రస్తుతం దేశంలో వివిధ రకాల డ్రోన్‌లను తయారు చేసే 400కు పైగా కంపెనీలు ఉన్నాయని స్మిత్ షా తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా మండిపడింది. ఇది మరో బుద్ధిహీనమైన, తప్పుడు సమాచారని ఎద్దేవా చేసింది. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే వీడియో అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. 

ఇది కూడా చదవండి: TG New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment