Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే ?

కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్‌పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్‌పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులు దాటాయని.. ఇలాంటివి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read:బిహార్‌ కులగణన ఫేక్ అన్న రాహుల్‌.. స్పందించిన ఎన్డీయే

ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు ఉన్నవారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థపై ప్రజలకు బాధ్యత రాహుల్‌పై ఉందని.. కానీ ఆయన దీనికి బదులు అబద్దాలు వ్యాప్తి చేస్తూ దేశ ఐక్యతను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇదిలాఉండగా..ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.  

Also Read: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు

'' బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలోని ప్రతీ సంస్థను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో పాటుగా భారతదేశంపై కూడా పోరాడుతున్నామని'' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శలు చేశారు. అయితే తాజాగా రాహుల్‌గాంధీపై దీనిపై కేసు నమోదవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: వందలు కాదు వేలల్లో రండిరా..12 గంటల్లో 1057మందితో శృంగారం.. ఇదిగో వీడియోలు!

Also read: దొంగకు అది సైఫ్‌ అలీఖాన్‌ ఇల్లు అని తెలీదు: అజిత్‌ పవార్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

రైతు ఉద్యమ నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. కనీస మద్ధతు ధరపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల కోరిక మేరకు ఆయన దీక్ష విరమించారు.

New Update
farmer leadar

farmer leadar Photograph: (farmer leadar)

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఓ రైతు ఉద్యమ నాయకుడు నిరాహార దీక్ష చేశాడు. పంజాబ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. 131 రోజుల తర్వాత అతను నిరాహార దీక్షను విరమించారు. పంజాబ్ రైతుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన్ని కోరాయి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్‌ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ నేపథ్యంలో ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్‌ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌,  రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment