/rtv/media/media_files/2025/12/05/frotuner-2025-12-05-10-42-54.jpg)
రెండు రోజులు పర్యటనలో భాగంగా నిన్న రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) ఇండియాకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీ(PM Modi) ఘన స్వాగతం పలికారు. విమానం దిగివచ్చిన పుతిన్ కు స్వాగతం పలికిన మోదీ కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. దీని తరువాత ఇద్దరూ ప్రధాని మోదీ అధికారి కారు అయిన ఫార్చ్యూనర్(fortuner-car) లో పీఎం నివాసికి వెళ్ళారు. అక్కడ ప్రధాని ఆయనకు ప్రైవేటుగా విందు ఇచ్చారు. ఈ మొత్తంలో ఒక విషయం హైలేట్ గా నిలిచింది. అదే పుతిన్ తన కారును వదిలేసి మోదీ కారులో వెళ్ళడం.
Also Read : H-1B వీసాలపై ట్రంప్ మరో కొ(చె)త్త రూల్.. వారందరికీ అమెరికా దారులు క్లోజ్?
ఫ్లైయింగ్ ఆన్ వీల్స్ ను వదిలేశారు..
రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ ఒకే కారులో ప్రయాణించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇది భారత్, రష్యాల బలమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. మాములుగా పుతిన్ ఎక్కడు వెళ్ళినా తన పర్శనల్ కారును తనతో పాటూ తెచ్చుకుంటారు. తన అత్యంత సురక్షితమైన ఆరస్సెనాట్ కారులో ప్రయాణిస్తారు. దీన్ని కదిలే భద్రతా కవచంగా పరిగణిస్తారు. ఫ్లైయింగ్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు దీన్ని. పుతిన్ ఈ కారును తప్పితే ఇంకే కారునూ వాడరు. కానీ భారత్ కు మాత్రం ఈ కారును ఆయన తీసుకురాలేదు. ఇది పుతిన్, ప్రధాని మోదీల మధ్య ఉన్న విశ్వాసానికి ప్రతిబింబమని చెబుతున్నారు. దాంతో పాటూ భారత్ పై పుతిన్ కున్న అంతులేని నమ్మకమని అంటున్నారు.
Also Read : అమెరికాలో ఉగ్ర కుట్ర..కారు నిండా తుపాకులతో పాక్ సంతతి వ్యక్తి
రేంజ్ రోవర్ కాకుండా ఫార్చ్యూనరే ఎందుకు..
పుతిన్ తన కారును వదిలేయడం ఒక విశేషం అయితే...ప్రధాని మోదీ తాను వాడే విలిసవంతమైనరేంజ్‌రోవర్ కారును పక్కనపెట్టి మరీ.. ఒక సాధారణ ఫార్చ్యూనర్‌లో పుతిన్‌ను తీసుకెళ్లడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలేంటీ ఫార్చ్యూనర్ స్పెషాలిటీ అంటే... ఇదొక సిగ్మా 4 ఎంటీ వాహనం. MH01EN5795 మహారాష్ట్ర నంబరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ బీఎస్-6 వాహనం 2024 ఏప్రిల్ లో రిజిస్టర్ అయింది. కార్దేఖో వెబ్‌సైట్ ప్రకారం, ఈ వాహనం ధర ₹4.5 మిలియన్లు. కొత్త భద్రతా వాహనాల సముదాయంలో భాగమైన ఈ కారు ఏప్రిల్ 2039 వరకు చెల్లుతుంది.
Follow Us