/rtv/media/media_files/2025/02/20/boRqVnqx6a5mPbwqhkqA.jpg)
PM Modi and Pawan Kalyan
Pawan Kalyan- Modi: ఢిల్లీ(Delhi) కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(BJP MLA Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కూడా హాజరయ్యారు. వేదికపై ప్రధాని మోదీ(Prime Minister Modi), పవన్ కళ్యాణ్ కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే మోదీ మీతో ఏం మాట్లాడారని పవన్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన ప్రధాని నాతో చిన్న జోక్ చేశారని అన్నారు. ఇవ్వన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకుంటున్నావా ? అని అడిగారని నవ్వుతూ అన్నారు. దానికి ఇంకా చాలా సమయం ఉందని నేను చెప్పానని తెలిపారు. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని చెయ్యు అని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. గురువారం మధ్యాహ్నం 12:25 గంటలకు రాంలీలా మైదానంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా(Lieutenant Governor VK Saxena) ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, పలువురు సెలబ్రేటీలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
Also Read: చైనా దుందుడుకు చర్య..ఫిలిప్పీన్స్ విమానాన్ని గుద్దేస్తామంటూ ఆట్లాట
ఢిల్లీ నాల్గవ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా..
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తరువాత రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం తర్వాత ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీళ్లకి గురువారమే శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..