PM Modi: ఢిల్లీ టూ డెహ్రాడూన్ ప్రయాణం 2.5 గంటలే! ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ మధ్య ప్రయాణాన్ని మరింత సులభం చేస్తూ నిర్మించిన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. 11,868 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఉత్తరాది రాష్ట్రాల రవాణా వ్యవస్థలో కీలకం.

New Update
_ PM Modi

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్(Delhi-Dehradun Economic Corridor) మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తూ నిర్మించిన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు ప్రారంభించనున్నారు. సుమారు 11,868 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఉత్తరాది రాష్ట్రాల రవాణా వ్యవస్థలో కీలకం కానుంది. ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రసిద్ధ జై మా దాత్ కాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సుమారు 212 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 'ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్'గా పిలుస్తున్నారు. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి 6 గంటల సమయం పట్టేది. అయితే ఈ కొత్త హైవే అందుబాటులోకి రావడంతో, ఇప్పుడు కేవలం రెండున్నర గంటల్లోనే డెహ్రాడూన్ చేరుకోవచ్చు. ఇది పర్యాటకులతో పాటు, ముఖ్యంగా చార్‌ధామ్ యాత్రికులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.

Also Read :  ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కార్మికుల వేతనాలు పెంపు

వన్యప్రాణుల రక్షణకు పెద్దపీట

ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్: రాజాజీ నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే ఈ మార్గంలో జంతువులకు ఆటంకం కలగకుండా 12 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించారు.
యానిమల్ పాస్‌లు: జంతువుల రాకపోకల కోసం 6 అండర్‌పాస్‌లు, 8 యానిమల్ పాస్‌లు, ఏనుగుల కోసం ప్రత్యేకంగా 200 మీటర్ల పొడవైన రెండు మార్గాలను ఏర్పాటు చేశారు.
టన్నెల్ నిర్మాణం: దాత్ కాళీ ఆలయం వద్ద పర్యావరణానికి హాని కలగకుండా 370 మీటర్ల పొడవైన టన్నెల్‌ను లెటెస్ట్ టెక్నాలజీతో నిర్మించారు.

Also Read :  ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి... ఆయన గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

అత్యాధునిక మౌలిక సదుపాయాలు

మొత్తం నాలుగు దశల్లో పూర్తయిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 100 అండర్‌పాస్‌లు, 5 రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ అటవీ ప్రాంతంలో భారీ వంతెనలను నిర్మించారు. ఈ హైవే కేవలం ఢిల్లీ-డెహ్రాడూన్‌నే కాకుండా.. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలకు కూడా అనుసంధానం అవుతుంది. హరిద్వార్, రూర్కీ వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ మార్గం ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2021లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, అదే ఏడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీ మరోసారి దీనికి శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2024 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు, వేగంగా పనులు జరుపుకుని నేడు ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఈ కారిడార్ వల్ల కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు