![Nirmala Sitharaman](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/01/vYHC7nBFWVaYiIQsqKWj.jpg)
Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామమన్ (Nirmala Sitharaman) శనివారం పార్లమెంట్‌లో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశంలో ఆమె నాన్ స్టాప్ గంటా 14 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు ఆమె బడ్జెట్ సమావేశాల్లో 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తక్కువ సమయం మాట్లాడారు. 2020 ఫైనాన్షియల్ ఈయర్ బడ్జెట్ సెషన్‌లో అత్యధికంగా 2 గంటల 40 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ఇంకా 2 పేజీల ప్రసంగం ఉంది. సమయం లేదని ఆమె 2 గంటల 40నిమిషాలతో సరిపెట్టకుంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
Also Read : ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!
UNION BUDGET 2025 - Nirmala Sitharaman
బడ్జెట్ ప్రసంగాల్లో 1977లో మధ్యంతర బడ్జెట్ (Union Budget 2025) సమయంలో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ 800 పదాలతో స్పీచ్ ఇచ్చారు. ఇప్పటివరకూ అదే అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం. ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి తగ్గుదల, పేద, మధ్యతరగతి కుటుంబాలపై పన్నుల భారం పెరగడంతో ఇన్‌కమ్ ట్యాక్సులను ఆర్థిక శాఖ తగ్గించింది. సంవత్సరానికి 12 లక్షలు వరకు సంపాధిస్తున్న వ్యక్తులకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ సమావేశంలో ప్రకటించారు. ఇది ట్యాక్స్ పేయర్లకు పెద్ద ఊరట అనే చెప్పాలి. అంతేకాదు వచ్చేవారం పార్లమెంట్‌లో కొత్త ఆదాయపు చట్టం బిల్లును కూడా ప్రవేశపట్టనున్నారు. 1961 నాటి ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ స్థానంలో మరో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తేనుంది. ఆ చట్టం ప్రవేశపెట్టడంలో కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఇది కూడా చూడండి: Chennai Crime: ఏసీ ఆన్ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్ మిస్టరీ!
Also Read : తిరుపతి లడ్డూ తయారీని పరిశీలించిన టీటీడీ చైర్మన్.. అధికారులకు కీలక ఆదేశాలు!