/rtv/media/media_files/2025/03/18/xqye6I1auZ4z1SdeOUjZ.jpg)
monkey
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీవీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువ వీడియోలు కోతులకు సంబంధించినవే ఉంటాయి. ఈ వెరైటీ వీడియోలు చూసేందుకు నెటిజన్లు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మనం నిత్యం ఆలయాల దగ్గర, పర్యాటక ప్రదేశాల దగ్గర కోతులను ఎక్కువగా చూస్తుంటాం. అక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి ఏవోక వస్తువులు తీసుకుని వారిని ఏడిపిస్తూంటాయి.
Also Read: America: అమెరికా దాటి వెళ్లకండి... హెచ్-1బీ వీసాదారులకు హెచ్చరికలు!
శామ్సంగ్ ఫోన్ కొట్టేసిన కోతి!
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 17, 2025
మాంగో పానీయం కోసం దాన్ని తిరిగి ఇచ్చిన కోతి! #Monkey #Vrindavan #UANow pic.twitter.com/mzbF3RQyoi
కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులనే ఎత్తుకుపోతుంటాయి. ఏ వస్తువులనైన వానరాలు తినే వస్తువులు అనుకుంటాయి. ఈ నేపథ్యంలో బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది. దీంతో అతను.. లబోదిబో మన్నాడు. కోతి తీరిగ్గా అక్కడున్న ఒక కట్టడం పైకిఎక్కేసి... ఆ ఫోన్ యజమానికి చుక్కలు చూపించింది. పాపం.. అతను తన ఫోన్ ఇవ్వాలని కోతిని ఎంతగానో బతిమాలడుకున్నాడు.
Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!
ఇంతలో అక్కడున్న వాళ్లు ఆ పర్యాటకుడికి ఓ సలహా ఇచ్చారు. దానికి ఇష్టమైన దాన్ని విసిరితే.. దాని చేతిలో ఉన్న మొబైల్ ను కిందకు పడేస్తుందేమో అని అన్నారు. దీంతో అతగాడు.. ఇదే ఉపాయాన్ని అప్లై చేశాడు. కోతి ముందుకు ఒక మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసిరాడు.అది కాస్త కోతి క్యాచ్ పట్టింది. ఆ తర్వాత వానరం..ఆ మ్యాంగోను తన చేతిలో తీసుకుని..దాని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను కింద పడేసింది. దీంతో ఆ పర్యాటకుడు హమ్మయ్యా.. నా ఫోన్ అయితే దొరికిపోయిందోచ్ అని పండగ చేసుకున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోతి కూడా క్విడ్ కో ప్రో చేస్తుందీగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!
Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!