Mohammad shami: మరో వివాదంలో షమీ.. కూతురు చేసిన పనిపై ముస్లిం పెద్దలు ఫైర్!

భారత క్రికెటర్ మహ్మద్ షమీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. షమీ కూతురు ఐరా హోళీ రంగుల్లో దర్శనమివ్వడంతో ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. 'హోళీ హిందువుల పండుగ. షరియా తెలిసిన వారు హోళీ సెలబ్రేట్ చేసుకోవడం నేరం' అంటూ రజ్వీ హెచ్చరించారు.

New Update
shami

shami Photograph: (shami)

Mohammad shami: భారత క్రికెటర్ మహ్మద్ షమీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రంజాన్ ఉపవాసల సందర్భంగా ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా కూల్ డ్రింక్స్ తాగిన షమీపై ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా షమీ కూతురు హోళీ రంగుల్లో దర్శనమివ్వడంతో మరోసారి ముస్లిం మత పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

ముస్లింలు చేసుకోవద్దు..

ఈ మేరకు  షమీ కూతురు ఐరా తన స్నేహితులతో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొనట్లు తెలుస్తోంది. హోళీ రంగుల్లో మునిగితేలిస దుస్తుల్లో కనిపించడంతో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు రజ్వీ ఫైర్ అయ్యారు. షరియాలో లేని పనులు పిల్లలు చేయడానికి అనుమతించొద్దని షమీ కుటుంబసభ్యులకు సూచించారు. 'హోళీ హిందువుల పండుగ. ముస్లింలు చేసుకోవద్దు. షరియా తెలిసిన వారు హోళీ సెలబ్రేట్ చేసుకోవడం నేరం' అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ చర్చనీయాంశమైంది. 

ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం వివాదాస్పదమైంది. మహమ్మద్ షమీ మ్యాచ్ సమయంలో డ్రింక్ తాగడంతో ముస్లిం పెద్దలు అతడిపై విరుచుకుపడ్డారు. షమీ చేసిన పనికి అంతా కలిసి అతడిని విమర్శించారు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ.. షమీపై తీవ్రంగా మండిపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) పాటించనందుకు మహమ్మద్ షమీపై అసహనం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు