/rtv/media/media_files/2026/04/02/medical-student-commits-suicide-in-karnataka-over-affair-rumours-with-professor-2026-04-02-17-17-35.jpg)
medical student commits suicide in karnataka over Affair rumours with Professor
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం(Illegal Affair) ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు. దీంతో ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో రాఘవేంద్ర ఆయుర్వేద కాలేజీ ఉంది. ఇందులో నిఖిత (22) అనే స్టూడెంట్(medical-student) బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ (BAMS) ఫైనల్ ఇయర్ చదువుతోంది.
Also Read: రూ.167 కోట్లకు అమ్ముడుపోయిన రవివర్మ పెయింటింగ్..
Medical Student Commits Suicide In Karnataka
ఆ కాలేజీలో డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో నిఖిత చదువు విషయంలో చొరవగా మాట్లాడేది. దీంతో నిఖిత క్లాస్‌మెట్స్ కొందరు ఆమెకు, ఆ లెక్చరర్ మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు పదేపదే ఆమెను అవమానించేలా మాట్లాడారంటూ నిఖిత తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
Also read: Floccinaucinihilipilification?.. 29 అక్షరాల పదాన్ని పలికిన న్యాయమూర్తి.. ఎందుకో తెలుసా ?
ఇలాంటి తప్పుడు మాటలను పట్టించుకోకుకండా చదువుపై ఫోకస్ పెట్టాలని తమ కూతురుకు ధైర్యం చెప్పామని అయినప్పటికీ తోటి విద్యార్థులు వేధించారంటూ వాపోయారు. ఆ మనస్థాపంతోనే నిఖిత ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు గదిలో సూసైడ్ లేటర్ కూడా దొరికిందని.. అందులో తన మరణానికి కారణమైన విద్యార్థుల పేర్లు చెప్పిందని చెప్పారు. వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Follow Us