వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనునుంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఆదివారం మన్‌కీ బాత్‌లో మహా కుంభమేళ గురించి మాట్లాడారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునిక మేళవింపుగా ఈ వేడుకను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఏర్పాట్లు ఇవే మహా కుంభమేళ భద్రత కోసం 50 వేల మంది సిబ్బందితో పారామిలిటరీ బలగాలను మోహరించనున్నారు. 2700 సీసీకెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. తొలిసారిగా అండర్‌వాటర్ డ్రోన్లను వినియోగించనున్నారు. పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లు.. 56 మంది సైబర్ వారియర్ల బృందం అందుబాటులో ఉండనున్నాయి. కుంభమేళ సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలు అందిచనున్నాయి. తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఒకేసారి 200 మందికి చికిత్స చేయగల భీష్మ క్యూబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. Also Read: బోరుబావిలో పడిన బాలుడు.. 16 గంటలు శ్రమించినా.. ! నేత్ర కుంభ్ శిబిరం ద్వారా 5 లక్షల మంది యాత్రికులకు కంటి పరీక్షలు, 3 లక్షలకు పైగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. కుంభమేళ జరిగే ప్రాంతంలో 92 రోడ్లను పునర్నిర్మాణం చేయనున్నారు. 17 ప్రధాన రహదారుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఒకవేళ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేలా బహుళ-విపత్తు ప్రతిస్పందన వాహనాలను మోహరించనన్నారు. అలాగే అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని ఆపేందుకు నాలుగు ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్స్ వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్‌పై నిషేధం, వాడిన వస్తువులు మళ్లీ వినియోగించేలా ప్రోత్సహించడం , దేశ సాంస్కృతిక వారసత్వం ప్రదర్శించడం కోసం ప్రయాగ్‌రాజ్‌లో కళాగ్రామ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం! Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్