Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 13,000 రైళ్లను నడపనుంది.

New Update
kumbh mela

kumbh mela

ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) ప్రారంభం అయ్యింది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఇందుకు వేదిక అయ్యింది. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా 35 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి తరలివస్తారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్‌  భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతతోపాటు సౌకర్యాల కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్‌ కుంభమేళాగా మార్చేసింది.

Also Read: Bhogi: పెద్ద పండుగ తొలి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా!

భారతీయ ఆధ్యాత్మిక శోభను ప్రపంచానికి చాటటమే లక్ష్యంగా కుంభమేళాను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) వివరించారు. ఇది సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నమని అన్నారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది భక్తులు వరకు ఉండగలిగేలా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.  యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

భద్రత కోసం 55 పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు.సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వచ్చేశారు. శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలుగుతోపాటు అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే వీలుగా  కాల్‌ సెంటర్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

మహా కుంభమేళా... 13,000 రైళ్లు

జనవరి 13 కుంభమేళా మొదలైన పుష్యపౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న విశేష మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి పండుగలు ఉన్నాయి. ఈ పర్వదినాల్లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిసిన విషయమే.

అందుకే మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 3000 ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా 13,000 రైళ్లను నడపనుంది. సుమారు 2 కోట్ల మంది రైలు ప్రయాణం ద్వారా కుంభమేళాకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Also Read: పది రూపాయల కోసం లొల్లి.. మాటమాట పెరిగి తన్నుకున్నారు

Also Read:  TG: తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు