/rtv/media/media_files/2025/03/20/RVyc77hO2LapcT4DtYHB.jpg)
Madras High Court sensational verdict in wife and husband porn video case
Porn case: పచ్చని సంసారంలో పోర్న్ సైట్స్ చిచ్చురేపాయి. పెళ్లి చేసుకుని ఆనందంగా గడుపుతున్న దంపతులకు శృంగార వీడియోలు మనశ్శాంతి లేకుండా చేశాయి. అయితే సాధారణంగా భర్తలు మాత్రమే రతి సినిమాలు చూసి భార్యలను టార్చర్ చేసిన సందర్భాలు చూసి ఉంటాం. కానీ క్ష భార్య లైంగిక వాంఛతో భర్తను వేధించిన కేసులు అరుదుగా తారసపడుంటాయి. ఇలాంటి ఓ అరుదైన ఘటనే చెన్నైలో చోటుచేసుకోగా ఈ కేసు విడాకుల డిమాండ్‌తో కోర్టు మెట్లు ఎక్కేవరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హస్త ప్రయోగం చేసుకునే స్వేచ్ఛ..
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పోర్న్ వీడియోలకు బానిసైందని, అవి చూసి తనను టార్చర్ చేస్తుందని, విడాకులు ఇప్పించాలంటూ మద్రాసు హైకోర్టులో ఫిటిషన్ వేశాడు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక స్వేచ్ఛను వదులుకోరని తెలిపింది. అంతేకాదు వారికి హస్త ప్రయోగం చేసుకునే హక్కు ఉంటుంది. స్వీయ ఆనందంలో మునిగిపోవడం వివాహాన్ని రద్దు చేయడానికి కారణం కాకూడదు అని న్యాయస్థానం సూచించింది.
స్వీయ ఆనందాన్ని హరించలేం..
ఈ మేరకు భర్త అప్పీల్‌ను తోసిపుచ్చిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమల ధర్మాసనం.. ‘స్వీయ ఆనందాన్ని హరించడం సరైనది కాదు. పురుషుల్లో హస్తప్రయోగం సరైనదే అయితే స్త్రీలకు కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లైన ఒక మహిళ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది. ఒక వ్యక్తిగా, ఒక మహిళగా ఆమె ప్రాథమిక గుర్తింపు తన జీవిత భాగస్వామి హోదా వల్ల కోల్పోదు' అని ధర్మాసనం వివరించింది.
Also read : ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో
అలాగే నీలి చిత్రాలకు బానిసగా మారడం చెడ్డ అలవాటే. నైతికంగా సమర్దించలేం. పోర్న్ వీడియోలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ జీవిత భాగస్వామితో క్రూరంగా ప్రవర్తించినట్లు కాదు. పోర్న్ చూసే వ్యక్తి జీవిత భాగస్వామిని తనతో లేదా ఆమెతో చేరమని బలవంతం చేస్తే, అది ఖచ్చితంగా క్రూరత్వమే. ఈ వ్యసనం కుటంబం బాధ్యతలపై ప్రతికూల ప్రభావం ఉందని రుజువుచేయగలితే తప్పా విడాకులు మంజూరు చేయలేమని తెలిపింది. అంతేకాదు భార్య తన జీవిత భాగస్వామిని బలవంతం చేయకుండా ప్రైవేట్‌గా పోర్న్ చూసినంత మాత్రాన అది వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంటూ విడాకుల పిటిషన్ కొట్టివేసింది.
Also read : ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?
(tamil-nadu | high-court | porn-movies | wife-and-husband | telugu-news | rtv telugu news | today telugu news | latest-telugu-news)