/rtv/media/media_files/2025/02/10/YV7PHX6OVV0POH0BZNWu.webp)
Maha Kumbhmela 2025
మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు.రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు సగటున 1.44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ముగించుకున్న భక్తులు...కాశీ, అయోధ్యలకు వెళ్తున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుండడంతో కాశీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల పై ఆంక్షలు విధించారు.
మరో వైపు రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో లోకో పైలట్ ఉండే ప్రాంతాల్లో కూర్చునే ప్రయత్నం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ లో రైల్వే స్టేషన్ వెలుపల భక్తుల రద్దీ కారణంగా ...ఉత్తర రైల్వే ప్రాంతంలోని లఖ్‌నవూ డివిజన్ ఫిబ్రవరి 9 మధ్యాహ్నం నుంచి 14 అర్థరాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!
రద్దీ ఇంకా కొనసాగుతూనే...
మహాకుంభ్ లోని ఎనిమిది రైల్వే స్టేషన్లు ప్రత్యేక రైల్వే సేవలను అందుబాటులో ఉంచాయి. ఇదిలా ఉండగా...ఈ కార్యక్రమం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా...రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా వాహనాలతో నిండిపోతున్నాయి. సుమారు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
గంటల కొద్ది యాత్రికులు వాహనాల్లోనే ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనిమిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్-కాన్పూర్, ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్-వారణాసి-మిర్జాపూర్, ప్రయాగ్ రాజ్-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. పుణ్యస్నానాలు ముగించుకున్న భక్తులు కాశీ,అయోధ్యకు వెళ్తుండడంతో ఆ మార్గాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది.
రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాఉల ఆచరించారని తెలుస్తుంది.
Also Read:BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!
Also Read: Kiran Royal: పవన్ కల్యాణ్ అభిమానిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతా: కిరణ్ రాయల్